ప్రతిపక్షం లేకుండా చేయాలనే కుట్రలు

71404853611_625x300కడప: ‘మండల పరిషత్, జిల్లా పరిషత్, మున్సిపాలిటీల్లో ఆధిక్యం ఉన్నా క్యాంపులు నిర్వహించుకోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితిలో ప్రజాస్వామ్యం ఉంది… ప్రజలకు అబద్ధాలు చెప్పి, మోసాలతో గద్దెనెక్కారు… ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చే స్థితిలో లేరు… అందుకే ప్రతిపక్షమే లేకుండా చేయాలనే కుట్రలు చేస్తున్నారు’అని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికార తెలుగుదేశం పార్టీపై ధ్వజమెత్తారు.
వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి స్వగ్రామం దేవగుడిలో క్యాంపులో ఉన్న మూడు మండలాల ఎంపీటీసీలు, జమ్మలమడుగు కౌన్సిలర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన టీడీపీ వైఖరిపై నిప్పులు చెరిగారు.  చంద్రబాబుకు సవాల్ విసురుతున్నా… ఇప్పుడు ఎన్నికలు నిర్వహించండి 67 స్థానాలున్న వైఎస్సార్ సీపీకి  167 స్థానాల్లో ప్రజలు పట్టం కడతారు.

Leave a Comment