నేడు వైఎస్ జయంతి

41399312249_625x300హైదరాబాద్ : దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 65వ జయంతిని పురస్కరించుకుని మంగళవారం పెద్దఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. సంక్షేమ పథకాల ప్రదాతగా పేద, బడుగుల హృదయాల్లో నిలిచిపోయిన వైఎస్‌కు నివాళులర్పించేందుకు పలు చోట్ల ప్రజలు స్వచ్ఛందంగా సన్నాహాలు చేసుకుంటున్నారు. రాష్ట్రంలో  వర్షాలు కురవాలని ప్రార్థిస్తూ వరుణ యాగాలు నిర్వహించాలని పార్టీ శ్రేణులకు వైఎస్సార్ సీపీ పిలుపునిచ్చింది.

డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా పార్టీ కేంద్ర, జిల్లా కార్యాలయాల్లో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వైఎస్ సమాధి వద్ద నివాళులర్పించడానికి పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం ఇడుపులపాయకు చేరుకున్నారు. ఆయనతో పాటు వైఎస్ విజయమ్మ, వైఎస్ షర్మిల తదితరులు కూడా ఇడుపులపాయకు వెళ్లారు. ఆక్కడ కుటుంబ సభ్యులతో కలిసి వైఎస్‌కు శ్రద్ధాంజలి ఘటిస్తారు.
 

Leave a Comment