అమెరికాకు అక్రమ మార్గాల్లో వలస వచ్చిన వారి విషయంలో ఉదారంగా వ్యవహరించాలని ఆ దేశ అధ్యక్షుడు బరాక్ ఒబామా నిర్ణయించారు. ప్రత్యేకించి నైపుణ్యం కలిగిన విదేశీయుల సేవలను వినియోగించుకునే విషయంలో ఈ తరహా చర్యలు దేశానికి మరింత మేలు చేయనున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ విషయంపై దేశ ప్రజలనుద్దేశించి ఆయన ప్రసంగించారు. అమెరికా వలసవాద చట్టాల్లో తాజా మార్పుల వల్ల భారత్, చైనా నుంచే కాక వివిధ దేశాల నుంచి సరైన పత్రాలు లేకుండా అమెరికా వచ్చిన దాదాపు 50 లక్షల మందికి ఊరట లభించనుంది. ఈ నిర్ణయంతో… అమెరికా చట్టసభలో రిపబ్లికన్ల మెజారిటీ పెరిగిన నేపథ్యంలో వలసవాద చట్టాల సవరణ ప్రశ్నార్థకంగా మారింది. అయినా ఏమాత్రం వెనకడుగు వేయకుండా తాననుకున్న మేరకు వలసవాద చట్టాల సవరణకు ఒబామా మరింత ధైర్యంగా ముందడుగేశారు.
Recent Comments