అఖిల్ అదరగొడుతున్నాడు

అక్కినేని అఖిల్..హీరోగా ఇంకా తెరపై కాలుమొపనే లేదు. ‘మనం’ లోజస్ట్ మెరుపు తీగలా మెరిసాడంతే. కట్ చేస్తే.. ఇండస్ట్రీ టాక్ అఫ్ ది టౌన్ గా నిలిచాడీ అక్కినేని వారసుడు . భారీ అంచనాల మధ్య  నిఖిల్ ఎంట్రీ సినిమా ఇప్పుడు సెట్స్ వెళ్ళాడనికి రెడీ అవుతుంది. అయితే, ఈలోగా బ్రాండ్ అంబాసిడర్ గా ఆదరగొడుతున్నాడు. అక్కినేని ‘అందగాడు’ అనిపించుకున్న అఖిల్ తో కమర్షియల్స్ యాడ్ లు చేయడానికి  కార్పోరేట్ సంస్థలు ఆసక్తిచూపుతున్నాయి. ఇప్పటికే టైటన్ వాచెస్ కి బ్రాండ్ అంబాసడార్ గా వున్న అఖిల్ తాజాగా మరో బ్రాండ్ కి సైన్ చేశాడు. మౌంటెన్ డ్యూ కూల్ సాఫ్ట్ డ్రింకు బ్రాండ్ కి  అంబాసిడర్ గా ఒప్పందం కుదుర్చుకున్నాడు. దీనికి సంబంధించిన షూటింగ్ కూడా పూర్తయింది. త్వరలోనే ఈ యాడ్ ప్రసారం కానుంది. ఇక, అఖిల్ ఎంట్రీ సినిమా దాదాపు ఖరారైయింది. వీవీ వినాయక్ లో ఎంట్రీ ఇస్తున్నాడు అఖిల్.  శ్రేష్ మీడియా సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. త్వరలోనే ఈ సినిమాని లాంచనంగా ప్రారంభంకానుంది.

Leave a Comment