అతనితో సంబంధాలు అంటగట్టడం బాధేసింది: తమన్నా

Tamannahముంబై: బాలీవుడ్ దర్శకుడు సాజిద్ ఖాన్ సంబంధాలను అంటగట్టడం చాలా బాధేసిందని సినీ నటి తమన్నా భాటియా అన్నారు. సాజిద్ నాకు సోదరుడిలాంటి వాడని తమన్నా తెలిపింది. దక్షిణాదిలో అగ్రతారగా వెలుగొందిన తమన్నా.. అజయ్ దేవగణ్ సరసన ‘హిమ్మత్ వాలా’ చిత్రంలో నటించింది. సాజిద్, తమన్నాల సంబందాలపై బాలీవుడ్ లో ప్రచారం జోరందుకుంది.
సాజిద్ నా సోదరుడు. నేను రాఖీ కూడా కట్టాను. రూమర్లు చాలా వినిపిస్తున్నాయి. ఓ యాక్టర్ ను డైరెక్టర్ నమ్మితే.. సంబంధాలను అంటగడుతారా? అంటూ తమన్నా ఓ ఇంటర్వ్యూలో విచారం వ్యక్తం చేశారు. సైఫ్ ఆలీ ఖాన్, రితేష్ దేశ్ ముఖ్, రామ్ కపూర్, బిపాసా బసు, ఇషా గుప్తాలతో కలిసి ‘హమ్ షకల్స్’ చిత్రంలో నటించింది.
తమన్నా పాత్రతో పోల్చితే తన పాత్రకు అంతగా ప్రాధాన్యత ఇవ్వలేదనే ఆరోపణపై బిపాసా బసు ఈ చిత్రం ప్రచారానికి దూరంగా ఉండటంపై మరో రూమర్ కూడా మీడియాలో ప్రచారం జరుగుతోంది. బిపాసా ప్రచారంలో పాల్గొనకపోవడానికి కారణం తనకు తెలియదని తమన్నా వెల్లడించింది. హాస్య చిత్రాలను రూపొందించడంలో దిట్ట సాజిద్ పై పొగడ్తలని తమన్నా గుమ్మరించింది.

Leave a Comment