అనకొండా నోట్లోకి సజీవంగా వెళ్తున్న రొసోలి….

అనకొండా నోట్లోకి సజీవంగా వెళ్తున్న మొట్టమొదటి వ్యక్తిగా అమెరికాకు చెందిన రొసోలి రికార్డ్ క్రియేట్ చేశాడు.  పర్యావరణ ప్రేమికుడు, సాహసి అయిన పాల్ రొసోలి అనకొండకు ఆహారమయ్యే కార్యక్రమాన్ని డిస్కవరీ చానల్‌ వచ్చేనెల 7న ప్రసారం చేస్తుందట! ట్విట్టర్‌లో రొసోలీ పెట్టిన 30క్షణాల వీడియో దృశ్యాలు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. రాకాసిపాము మింగేసినా ఏమీకాకుండాస్నేక్‌ ప్రూఫ్‌ సూట్‌ధరించి సాహసం చేశాడు. సజీవంగా అనకొండ నోట్లోకి వెళ్లి, అది ఆహారాన్ని ఎలా మింగుతుందో చిత్రీకరిస్తాడు. సజీవంగానే తిరిగి వస్తాడు. అయితే ఇలాంటి సూట్ ధరించిన వారిని మింగడం వల్ల అనకొండ ప్రాణాలకు ముప్పంటూ కార్యక్రమాన్ని నిలిపి వేయాలని అంటూ డిస్కవరీ చానల్‌ను జంతువులు హక్కుల కోసం పోరాడే పెటాడిమాండ్‌ చేసింది.

Leave a Comment