అరేబియా సముద్రంలో వాయుగుండం

అరేబియా సముద్రంలో ఏర్పడిన వాయుగుండం మరో 48 గంటల్లో తుపానుగా మారనుంది. దీంతో రెండ్రోజులపాటు తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ విభాగం తెలిపింది.  ఈ వాయుగుండానికి  ఈశాన్య రుతుపవనాలు తోడవడంతో  అధికంగా చలిగాలులు వీస్తాయి. ఆది, సోమవారాల్లో దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ గా రాయలసీమ, ఉత్తర కోస్తా జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.

Leave a Comment