అలా జరిగిపోయింది..!

Mahie Gillదేవ్ డీ, సాహిబ్ బీవీ ఔర్ గ్యాంగ్‌స్టర్, పాన్‌సింగ్ తొమార్ వంటి చిత్రాల్లో అద్భుతమైన నటనను ప్రదర్శించి, విమర్శకుల ప్రశంసలను అందుకున్న బాలీవుడ్ నటి మహీ గిల్ నిజానికి తాను నటిని అవుతానని ఎప్పుడూ అనుకోలేదట. అసలు నటిని కావాలన్న కోరిక లేకుండానే బాలీవుడ్‌లోకి అడుగుపెట్టడం, సినిమాల్లో నటించడం జరిగిపోయాయట. తొలి సినిమాలో నటించడం నుంచి ఇప్పటిదాకా నటించిన చిత్రాలన్నింటిని తాను ఇక్కడ కెరీర్‌ను నిర్మించుకుందామనే యోచనతో అంగీకరించలదేట. మొదటి సినిమా తర్వాత మరో చిత్రంలో నటించాల్సిందిగా, ఆ తర్వాత ఇంకో సినిమాలో నటించాల్సిందిగా.. ఇలా తనపై సన్నిహితులు, కుటుంబ సభ్యులు, అభిమానులు ఒత్తిడి చేయడంతోనే అంగీకరించడం, ఆ తర్వాత నటించడం జరిగిపోయాయట.
 
 అయితే నటించిన అన్ని చిత్రాల్లో తన నటనకు ప్రేక్షకులు మంచి మార్కులు వేయడంతో చాలా సంతోషంగా ఉందని, అందుకు దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానని ఓ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పింది. ఎటువంటి అనుభవం లేకుండానే కెమెరా ముందుకు వచ్చే ధైర్యం చేశానని, అదే తెగువతో ఇన్ని సినిమాల్లో నటించానని, చివరిసారిగా ‘గ్యాంగ్ ఆఫ్ ఘోస్ట్’ చిత్రంలో కనిపించానని చెప్పిన ఈ సుందరి ప్రస్తుతం ‘క్యారీ ఆన్ జట్టా 2’లో నటిస్తున్నట్లు చెప్పింది. ప్రత్యేకమైన పాత్రలంటే ఇష్టపడే తనకు అంటువంటి అవకాశాలే వస్తున్నాయని, ప్రతి పాత్రను సవాలుగా తీసుకొని నటించడాన్ని ఎంజాయ్ చేస్తున్నాని చెప్పింది. పరిశ్రమలోకి రాకముందు- వచ్చిన తర్వాత మీలో వచ్చిన మార్పేంటి? అని అడిగిన ప్రశ్నకు మహీ సమాధానమిస్తూ.. చండీగఢ్‌లో ఉన్నప్పుడు తనకు జుట్టు బాగా ఉండేదని, ముంబైకి వచ్చిన తర్వాత కాలుష్యం కారణంగా జుట్టు సన్నబడిందని చెబుతూ నవ్వేసింది.
 

Leave a Comment