ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణస్వీకారం

babuగుంటూరు: నూతన ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు దైవసాక్షిగా ప్రమాణస్వీకారం చేశారు. గుంటూరు-విజయవాడ మధ్య ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా ఉన్న 70 ఎకరాల విశాల ప్రదేశంలో  ఏర్పాటు చేసిన వేదికపైన  గవర్నర్ నరసింహన్ చంద్రబాబు చేత ప్రమాణం చేయించారు. చిత్తూరు జిల్లా కుప్పం నుంచి శాసనసభ్యుడుగా ఎన్నికైన చంద్రబాబు గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు రెండు సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు.

ప్రమాణస్వీకారోత్సవానికి బిజెపి సీనియర్ నేతలు అద్వానీ, మురళీమనోహర్ జోషి,  కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, వెంకయ్య నాయుడు, నిర్మలా సీతారామన్‌, ప్రకాష్ జవదేకర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్, గోవా, నాగాలాండ్ ముఖ్యమంత్రులు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, బోయపాటి శ్రీను, హిందీనటుడు వివేక్ ఓబ్రాయ్తోపాటు రాజకీయ, సినీ, పారిశ్రామిక రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ప్రమాణస్వీకారానికి ముందు ప్రముఖులకు చంద్రబాబు నాయుడు స్వాగతం పలికారు.  

బహిరంగ ప్రదేశంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందున కట్టుదిట్టంగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రమాణస్వీకారానికి ముందు సాయంత్రం నుంచి వేదికపైన సినీకళాకారులు సాంస్కృతి కార్యక్రమాలు నిర్వహించారు.

Leave a Comment