ఆంధ్రా ఉద్యోగులను ఇక్కడ పనిచేయనీయం: కేసీఆర్

kcrహైదరాబాద్: 610 జీవో ఉల్లంఘించి తెలంగాణలో ఉద్యోగాలు పొంది ప్రమోషన్లకు ప్రయత్నిస్తే వారికి జీతాలు చెల్లించమని తెలంగాణ రాష్ట్ర సమితి శాసన సభ పక్ష నాయకుడు కేసీఆర్ స్పష్టం చేశారు.
బలవంతంగా ఇక్కడే కొనసాగితే వారిని లూప్‌లైన్‌లో పెడతామని తెలంగాణ ఉద్యోగులతో కేసీఆర్ అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆంధ్రా ఉద్యోగులను తెలంగాణ రాష్ట్రంలో పనిచేయనీయమని కేసీఆర్ తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వంలో బలవంతంగా పనిచేయాలని చూస్తే జీతాలు చెల్లించమని, 610 జీవో ఉల్లంఘించి అక్రమంగా ఉద్యోగాలు పొందడమే నేరమని కేసీఆర్ చెప్పారు.  నిబంధనలు ఉల్లంఘించడమే కాకుండా  ప్రమోషన్లకు చేసే యత్నాలను తిప్పికొడతామని కేసీఆర్ తెలిపారు.

Leave a Comment