ఆకాశ వీధిలో అద్భుతః

ఈ విమానం డిజైన్ చూశారా.. 2050లో విమానయానం ఇలాగే ఉండబోతోందట. ఈ విషయాన్ని విమానాల తయారీ సంస్థ ఎయిర్‌బస్ చెబుతోంది. ఈ భవిష్యత్ విమానాల్లో మసాజ్ సీట్లు, కావాలనుకున్నప్పుడు విమానం పై భాగమంతా పారదర్శకంగా మారిపోయే ఏర్పాట్లు ఉంటాయి. అంటే.. మేఘాల్లో నిజంగానే తేలుతున్న అనుభూతి కలుగుతుందన్నమాట. అంతేకాదు.. మనం కూర్చునే సీట్లు.. మన శరీరంలోని వేడిని గ్రహించి.. విద్యుత్‌ను తయారుచేస్తాయి. విమానంలో గేమ్ జోన్స్, బార్లు వంటి సదుపాయాలెన్నో ఉంటాయి. విమానంలో ప్రయాణిస్తున్నట్లు కాకుండా.. ఏదో విహార యాత్రకు వెళ్లిన అనుభూతి ప్రయాణికులకు కలుగుతుందని ఎయిర్‌బస్ చెబుతుంది. ఇదంతా జరుగుతుందో లేదో తేలాలంటే.. 2050 రావాల్సిందే..

Leave a Comment