ఆదికి దీనిపైనే ఆశలు

aadi telugu actorలవ్ లీ వరకు బాగానే మ్యానేజ్ చేసాడు సాయికుమార్ కొడుకు ఆది. కానీ సుకుమారుడు సినిమాతో ట్రాక్ రికార్డు అంతా కొట్టుకుపోయింది. ఇప్పుడు ఆశలన్నీ ప్యార్ మే పడిపోయానే పైనే. లవ్ లీ లో తనతో జంట కట్టిన శాన్వితోనే మళ్లీ నటిస్తున్నాడు. శాన్వికీ లవ్ లీ తరువాత చెప్పుకోతగ్గ హిట్ లు లేవు. అడ్డా ఓ మాదిరిగా ఓకె,. రౌడీ అంతంత మాత్రం. ఆమెకు ఇదే ఆశ. ఇద్దరి చేతుల్లో మళ్లీ చెరో ప్రాజెక్టులు వున్నప్పటికి, ఈ సినిమా క్లిక్ అయితేనే కాస్త ముందుకు సాగేందుకు వీలుంటుంది. సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ సినిమా మరో వారంలో జనం ముందుకు వస్తోంది. ఆది తన కెరియర్ ను ఎలా ప్లాన్ చేసుకుంటున్నాడు అన్నది ఈ సినిమా చూస్తేగానీ తెలియదు.

Leave a Comment