ఆధిక్యం లో బీజేపీ

మహారాష్ట్ర, హర్యానా రెండు రాష్ట్రాలలో ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది .ఇప్పటి  వరకు వెలువడిన ఫలితాలను బట్టి మహారాష్ట్ర లో ని పుణె  జిల్లా  పార్వతినియోజక వర్గం నుంచి బిజేపీ అభ్యర్ది మాధురి సతీష్ మిషాల్ విజయం సాధించారు.రెండు రాష్ట్రాల్లో ను బీజేపీ ఆధిక్యతలో ఉంది. బీజేపీ మహారాష్ట్రలో 115 స్థానాలలో ఆధిక్యంలోఉంది. 67 స్థానాల్లో శివసేన,  45 స్థానాల్లో  కాంగ్రెస్ ,  43  స్థానాల్లో ఎన్సీపీ , ఇతరులు 16 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. హర్యానాలో  44 స్థానాలలో బీజేపీ ఆధిక్యంలో ఉంది.  కాంగ్రెస్ 14, ఐఎన్ఎల్ డీ 24,హెచ్ జేసీ 3 ఇతరులు 7 ,స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు.
మహారాష్ట్రలో శివసేన 70 స్థానాలలో ఆధిక్యతతో  రెండవ స్థానంలో ఉంది. రెండు రాష్ట్రాలలో  కాంగ్రెస్ మూడవ స్థానంలో ఉంది. మహారాష్ట్రలో ఎన్సీపి  బాగా వెనుకబడిపోయింది.మహారాష్ట్రలో  288 స్థానాలకు, హర్యానాలో 90 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. మహారాష్ట్రంలో అధికారంలోకి రావడానికి కావలసిన మ్యాజిక్ ఫిగర్ 145. హర్యానాలో మ్యాజిక్ ఫిగర్ 46. రెండు చోట్ల ఎవరి మద్దతు లేకుండా బీజేపీ అధికారాన్ని చేజిక్కించుకునే దిశగా దూసుకుపోతోంది.

Leave a Comment