ఆమెతో డేటింగ్ చేయాలని ఉంది: షేన్ వార్న్

Shane Warneలండన్: హాలీవుడ్ నటి ఎలిజబెత్ హ్యార్లీతో సంబంధాన్ని తెంచేసుకున్న ఆస్ట్రేలియన్  క్రికెటర్ షేన్ వార్న్ మరో తారపై మనసు పారేసుకున్నారు. మోడర్న్ ఫ్యామిలీ టెలివిజన్ సీరియల్ తార సోఫియా వెర్గరాతో డేటింగ్ చేయాలని ఉందని షేన్ వార్న్ ఓ రేడియో కార్యక్రమంలో తన మనసులో మాట బయటపెట్టాడు. అయితే సోఫియా వెర్గారా కూడా ఇటీవలే తన ప్రియుడికి గుడ్ బై చెప్పింది.
ఎవరితో డేటింగ్ చేయాలని ఉందని అడిగిన ప్రశ్నకు సోఫియాతో డేటింగ్ చేయాలనుందని షేన్ వార్న్ జవాబిచ్చారు. సోఫియా అభిమానిని నేను. ఆమె గొప్పగా ఉంటుంది. ప్రయత్నించడంలో తప్పేమి లేదు. మహిళలతో మర్యాదగా ప్రవర్తించే అంశంలో నాట్రాక్ రికార్డు బాగానే ఉంది అని రేడియో కార్యక్రమంలోతెలిపారు. షేన్ వార్న్ ప్రపోజల్ కు సోఫియా ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే.

Leave a Comment