ఆమె అందానికి ప్రపంచమే దాసోహం!

ఆమె అందానికి ప్రపంచం దాసోహమైపోయింది. ఆ దక్షినాది అందగత్తె   హాలీవుడ్లో జల్సా చేసింది. ఇప్పుడు ఇంటర్నేషనల్ వేదికపై మరోసారి తళుక్కున మెరిసింది. ఇండియన్ బ్యూటీ ఐశ్వర్యరాయ్ 67వ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో మెరిసిపోయింది. ఆ ఈవెంట్లో ఐష్  గోల్డ్ కలర్ గౌను వేసుకుని ఏంజిల్‌లా దర్శనమిచ్చింది. ఆ పోతపోసిన అందాన్ని ప్రేక్షకులు అలాగే కళ్లప్పగించి చూస్తూ ఉండిపోయారు.  బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ఐశ్వర్యరాయ్ బాగా లావెక్కిందనే విమర్శలు ఎదుర్కొంది. ఆ విమర్శలకు ఐష్ చెక్ పెట్టేసింది. స్లిమ్గా తయారై  అందర్నీ ఆశ్చర్య పరిచింది.

2014 కాన్స్ రెడ్ కార్పెట్‌పై ఐష్‌ ఊహించిన దానికంటే ఎక్కువ అందంగా కనిపించి చూసేవారి మతులుపోగొట్టింది. ఫిల్మ్ ఫెస్టివల్‌లో భాగంగా ఫ్లయింగ్ కిస్ ట్రయల్ కూడా నిర్వహిస్తుంటారు. ఈ సందర్భంగా ఐశ్వర్యరాయ్ వదిలేసిన ఫ్లయింగ్ కిస్‌కు అంతా ముగ్దులైపోయారు. దీంతో ఐష్ రీఎంట్రీ అదిరిపోబోతోందని బాలీవుడ్ అంచనా వేస్తోంది. అభిమానులు ఐశ్వర్యరాయ్ రీఎంట్రీ ఎప్పుడా ఎప్పుడా అని ఎదురుచూస్తున్నారు.

Leave a Comment