ఆర్కుట్ శకం ముగిసింది!!

30-orkutclosedసోషల్ మీడియా ప్రపంచంలో ఆర్కుట్ శకం ముగిసింది. గూగుల్‌కు చెందిన మొదటి సోషల్ నెట్‌వర్కింగ్ వెబ్‌సైట్ ఆర్కుట్‌ను అధికారికంగా మూసివేస్తున్నట్లు గూగుల్ ప్రకటించింది. ఫేస్‌బుక్, ట్విట్టర్ తదితర సామాజిక సంబంధాల వెబ్‌సైట్‌ల నుంచి తీవ్రమైన పోటీ నేపథ్యంలో ఆర్కుట్‌ను గూగుల్ మూసివేయకతప్పలేదు.ఆర్కుట్ సేవలను గూగుల్ 2004లో ఆరంభంలో ప్రారంభించింది. అదే సంవత్సరంలో ప్రారంభించబడిన ఫేస్‌బుక్ ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 1.28 బిలియన్ యూజర్లను సొంతం చేసుకుని నెం.1 సోషల్ నెట్‌వర్క్‌గా అవతరించింది. ఆర్కుట్‌కు బ్రెజిల్‌లో ఒకప్పుడు మంచి ఆదరణ ఉండేది. ఇప్పుడు ఈ ఘనతను కాస్తా ఫేస్‌బుక్‌ను సొంతం చేసుకుంది. ఆర్కుట్ సేవల నిలుపుదల నేపధ్యంలో యూట్యూబ్, బ్లాగర్ ఇంకా గూగుల్ + సర్వీసులు పై మరింత దృష్టిసారించనున్నట్లు గూగుల్ వెల్లడించింది.

Leave a Comment