ఆశక్తి కలిగిస్తున్న బన్నీ బ్రిటిష్ రీసెర్చ్ !

ఈ సంవత్సరం టాప్ కలెక్షన్స్ కొల్లగొట్టిన హీరోగా బన్నీ రికార్డు క్రియేట్ చేయడంతో ఆ రికార్డును కాపాడుకోవడానికి అల్లుఅర్జున్ తాను త్రివిక్రమ్ దర్శకత్వంలో నటిస్తున్న తన లేటెస్ట్ సినిమాలో చాల ప్రయోగాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.  ఈవెంట్ ఆర్గనైజర్ గా ముగ్గురు హీరోయిన్స్ తో రోమాన్స్ చేసే ఈ సినిమాలో బన్నీ గెటప్ డిఫరెంట్ గా ఉండబోతోంది అన్న వార్తలు ఇప్పటికే వచ్చాయి. అయితే ఆ వార్తలకు ఇప్పుడు మరింత క్లారిటీ వస్తోంది. ఈ సినిమాలో అల్లుర్జున్ లుక్ బ్రిటీష్ హీరో లుక్ లో ఉంటుందని సమాచారం.  చాల క్లాసీ లుక్ తో ఉండే ఈ స్టైల్ కోసం బన్నీ చాల రీసర్చ్ చేయడమే కాకుండా ప్రస్తుతం ప్యారిస్, లండన్ లో నడుస్తున్న లేటెస్ట్ ట్రెండ్స్ ను బన్నీ చాల లోతుగా ఈ సినిమాలోని తన లుక్ కోసం పరిశీలించాడని టాక్. అంతేకాదు ఈ సినిమాలో బన్నీ వేసుకునే డ్రెస్ కలెక్షన్స్ ప్రస్తుతం లండన్ లో హడావిడి చేస్తున్న 2014 వింటర్ 2015 సమ్మర్ ఫ్యాషన్ కలెక్షన్స్ ను పోలి ఉంటాయని టాక్.  అదేవిధంగా ఈ సినిమాలో బన్నీ హెయిర్ లుక్ కూడా లేటెస్ట్ బ్రిటీష్ ఫ్యాషన్ ట్రెండ్ ను పోలి ఉండబోతోందని అంటున్నారు. ఇలా ఎలా చూసినా అల్లుఅర్జున్ త్రివిక్రమ్ సినిమాలో తన కొత్త లుక్ తో బ్రిటీష్ హీరోగా కనిపించబోతున్నాడు అని అనుకోవాలి.

Leave a Comment