ఆశ్చర్య పరిచిన అంజలి డ్రస్ లుక్ !

అంజలికి డ్రస్సింగ్ సెన్స్ లేదు అంటూ ఆమధ్య కొంతమంది హీరోయిన్స్ చేసిన కామెంట్లకు సరైన సమాధానం ఇవ్వాలని కాబోలు అంజలి తన చిట్టిపొట్టి డ్రస్సులతో బుల్లితెర ప్రేక్షకులను ఖంగ్ తినిపించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. యాంకర్ ప్రదీప్ నిర్వహిస్తున్న ‘కొంచెం టచ్ లో ఉంటే చెబుతా’ కార్యక్రమంలో అంజలి గెస్ట్ గా రాబోతున్న ప్రోగ్రాంకు సంబందించి ప్రసారం అవుతున్న ప్రోమోలలో అంజలి లుక్ చూసి చాలామంది షాక్ అవుతున్నారు. ఇప్పటి వరకు ఈ కార్యాక్రమంలో సమంత, తమన్నా, కాజల్ లు ఎంతో హుందాగా డ్రస్ చేసుకుని ఈకార్యక్రమానికి వస్తే దీనికి భిన్నంగా అంజలి వేసుకున్న చిట్టిపొట్టి డ్రస్ లుక్ షాకింగ్ గా మారింది. త్వరలో ప్రసారం కాబోతున్న ఈ ఎపిసోడ్ లో తెలుగు తెర సీతమ్మ తన పై ఇప్పటి వరకు గాసిప్పులకు, తన పిన్నితో వచ్చిన విభేదాలకు సంబంధించి ప్రదీప్ అడిగే ప్రశ్నలకు ఎటువంటి సమాధానం ఇస్తుందో అన్న ఆ శక్తి అందరిలోనూ ఉంది. ప్రస్తుతం కన్నడ టాప్ యంగ్ హీరో పునీత్ రాజ్ కుమార్, జయం రవి సినిమాలలో హీరోయిన్ గా నటిస్తున్న అంజలి తన నటన కంటే ఎక్స్ పోజింగ్ కే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబోతోందా అని అనిపించేడట్లుగా అంజలి లుక్ దర్శనo ఇస్తోంది.

Leave a Comment