ఆ ఇద్దరు హీరోల జీవితాల్లో ఎన్ని ట్విస్టులో!

సినిమా పరిశ్రమలో ఎప్పుడు ఏం జరుగుతుం2దో ఎవ్వరూ ఊహించలేరు. అంతా మాయ. ఎవరు ఎప్పుడు ఓ వెలుగు వెలుగుతారో, ఎప్పుడు మసకబారిపోతారో చెప్పడం కష్టం.  ఒక సినిమా హిట్ అయితే ఆ హీరోని, హీరోయిన్ను ఆకాశానికి ఎత్తుతారు. ఫెయిల్ అయితే వారి మొఖం చూసేవారు ఉండరు. మంచి ఫామ్లో ఉన్నవారు హఠాత్తుగా డౌన్ఫాల్ అవుతారు.  సినిమా కథల్లో ఎన్ని మలుపులుంటాయో, సినీతారల జీవితాల్లో కూడా అన్ని ట్విస్టులు ఉంటాయి. చూస్తుండగానే అందలం ఎక్కుతారు. ఒక్కసారిగా పడిపోతుంటారు. అలా అందలం ఎక్కిన ఇద్దరు హీరోలు ప్రస్తుతం డౌన్ఫాల్లో పడిపోతున్నారు.

టాలీవుడ్ స్టార్ కమెడియన్గా  సునీల్ ఓ వెలుగు వెలిగాడు. బ్రహ్మానందం తరువాత ఆ స్థాయిలో తెలుగు సినిమా పరిశ్రమను ఆక్రమించేశాడు. బిజీ అయిపోయాడు. ఆ ఊపులోనే సిక్స్ ప్యాక్  హీరోగా మారిపోయాడు.  ‘అందాలరాముడు’ అదరగొట్టినా ఆ తరువాత ఆ స్థాయిలో సక్సెస్ కాలేకపోయాడు.  కథలను ఎంచుకోవడంలో సునీల్ ఫెయిలయ్యాడన్న విమర్శ వినవచ్చింది. ఎంత సేపూ రొటీన్గా కనిపిస్తూ చివరుకు ఫ్లాప్ హీరో అయిపోయాడు. ఎన్నో ఆశలు పెట్టుకున్న భీమవరం బుల్లోడు కూడా ఫ్లాప్ అవ్వడంతో సునీల్ ప్రస్తుతం తీవ్ర నిరాశతో ఉన్నట్లు సమాచారం. హీరోగా కొనసాగాలా? లేక కమెడియన్ గానే కొనసాగాలా? అన్న సందిగ్ధంలో సునీల్ ఉన్నట్లున్నారు.

హీరో నాని చిన్న సినిమాలతో పెద్ద సక్కెస్లు సాధించాడు. మంచి కథా చిత్రాలలో నటించి స్టార్ హీరో స్థాయికి ఎదిగాడు. ఈగతో మంచి పేరు సంపాదించాడు. ఆ తరువాత వరుసగా నాని డౌన్ఫాల్ మొదలైంది. ఇటీవల  తను నటించిన సినిమాలు వరుసుగా ఫ్లాపులు కావడంతో నాని దిక్కుతోచని స్థితిలో ఉన్నాడు. అతనితో చిత్రాలు నిర్మించినవారి పరిస్థితి కూడా అలానే ఉంది.  ఎంతగా అంటే నాని నటించిన ‘జేండాపై కపిరాజు’ని  కొనడానికి ఎవరూ ముందుకు రావడంలేదని సినీవర్గాల సమాచారం. ఈ నేపధ్యంలో ఎలాగైనా మళ్లీ పుంజుకోవడానికి నాని తీవ్రప్రయత్నాలు చేస్తున్నారు. సునీల్, నాని మళ్లీ జనరంజక చిత్రాలలో నటించి పూర్వపు స్థానాన్ని ఆక్రమించాలని ఆశిద్దాం.

Leave a Comment