ఇక మెకానికల్ ఇంజనీర్లకు ఉద్యోగాలే ఉద్యోగాలు

engineersఇక మెకానికల్, ఎలక్ట్రికల్ ఇంజనీర్లకు ఉద్యోగాలే ఉద్యోగాలు. పదిహేడు దేశాలు ఇప్పుడు తలుపులు బార్లా తెరిచి ఉద్యోగాలిస్తాం రండి అని పిలిచేందుకు రెడీ అవుతున్నాయి. మానవ వనరుల శాఖ ప్రయత్నాల వల్ల భారతదేశం ఇప్పుడు వాషింగ్టన్ ఒప్పంద దేశాల కూటమిలో భాగస్వామి అయింది. ఇందువల్ల భారత ఇంజనీర్లు సభ్య దేశాలలో  ఉద్యోగాలకు ఆయా దేశాల వారితో సమానంగా పోటీ పడొచ్చు.
శుక్రవారం ఈ ఒప్పందంలో భారత్ సంతకం చేసింది. ఇందులో జపాన్, మలేషియా, కొరియా, న్యూజీలాండ్, చైనా, ఐర్లండ్, యునైటెడ్ కింగ్ డమ్, అమెరికా, రష్యా, సింగపూర్, టర్కీ, కెనడా, చైనీస్ తైపే, హాంకాంగ్ లు సభ్యదేశాలు.
తొలి దశలో 200 కు పైగా ఇంజనీరింగ్ కాలేజీలను తొలి శ్రేణిగా గుర్తించి, ఆ కాలేజీల విద్యార్థులకు ఒప్పంద దేశాల్లో ఉపాధి అవకాశాలు అందచేస్తారు. తరువాత రెండవ శ్రేణిలోని కాలేజీల ప్రమాణాలు మెరుగుపరిచి విద్యార్థులకు ఉద్యోగార్హత కల్పిస్తారు. దీని వల్ల భారత్ కూడా ఇంజనీరింగ్ విద్యకు ఒక ప్రధాన కేంద్రంగా తయారవుతుంది. దేశదేశాల విద్యార్థులు ఇక్కడ చదువుకునేందుకు వస్తారు.
అయితే ఇది ఐటీ ఇంజీనీర్లకు వర్తించదు. వారు వాషింగ్టన్ ఒప్పందం కాక, సియోల్ ఒప్పంద పరిధిలోకి వస్తారు. సియోల్ ఒప్పందంలో భారత్ను భాగస్వామిగా చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అది కూడా జరిగితే మన విద్యార్థులకు ఉపాధాఇఅవకాశాలు ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతాయి.

Leave a Comment