ఇల్లు ఖాళీ చేస్తే నేనెక్కడుండాలి…

 

ఢిల్లీలో ప్రభుత్వ నివాసాన్ని ఖాళీ చేయాలంటూ  డైరెక్టరేట్ ఆఫ్ ఎస్టేట్ అధికారులు  కేంద్రమాజీ మంత్రి చిరంజీవికి నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు అక్బర్ రోడ్ లోని ఇంటినంబర్ 17కు నోటీసులు అతికించారు.  దీనిపై స్పందిచిన ఆయన  ప్రస్తుతం ఉన్న నివాస గృహాన్ని ఖాళీ చేస్తే తాను ఎక్కడ ఉండాలో చెప్పమని  సంబంధిత అధికారులను డిమాండ్ చేశారు. ప్రత్యామ్నాయ వసతి చూపించకుండా తక్షణమే తాను ఉంటున్న నివాస గృహాన్ని ఖాళీ చేయాలని నోటీసులు జారీ చేయడం అన్యాయమని అన్నారు. తనకు కొత్త నివాస గృహం కేటాయాంలని కోరుతూ సంబంధిత మంత్రిత్వ శాఖకు స్వయంగా లేఖ రాశానని చిరంజీవి తెలిపారు

Leave a Comment