అంతా సవ్యంగా జరిగితే రానున్న ఉగాదికి హైదరాబాదులో మెట్రో రైలు పరుగులు తీయాల్సి ఉంది. అయితే, మెట్రో రైలు ముందుకు వెళ్లకుండా ఎవరో కుట్ర
చేస్తున్నారని టీఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోపించారు.

ఎవరు ఎన్ని కుట్రలు చేసినా మెట్రో రైలు తొక్కుకుంటూ వెళుతుందని అన్నారు. ప్రార్థనా స్థాలాలు, చారిత్రక కట్టడాలు దెబ్బతినకుండా అసెంబ్లీ, కోఠి వెనుక నుంచి మెట్రో రైలు వెళుతుందని స్పష్టం చేశారు.
మరోవైపు, మెట్రో మేనేజ్ మెంట్‌కు, కేసీఆర్‌కు మధ్య విభేదాలు తలెత్తాయని… అందువల్లే మెట్రో పనుల్లో జాప్యం జరుగుతోందని కొంత మంది బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. మెట్రో రైలు ప్రాజెక్టు ముందుకు సాగకుండా కొందరు యత్నిస్తున్నారని కేసీఆర్ విరుచుకుపడ్డారు.
Recent Comments