ఉతికి ఆరేసిన ఊతప్ప: రాయల్‌పై బెంగళుర్ గెలుపు

కోల్‌కతా: ఐపియల్ 7లో భాగంగా జరుగుతున్న మ్యాచులో రాయల్ చాలెంజర్స్ బెంగళూర్‌పై జరుగుతున్న మ్యాచులో కోల్‌కత్తా నైట్ రైడర్స్ 30 పరుగుల తేడాతో విజయం సాధించింది. కోల్‌కాతా నిర్దేశించిన 196 పరుగుల లక్ష్య ఛేదనలో బెంగళూరు 5 వికెట్లు కోల్పోయి 165 పరుగులే చేయగలిగింది. యోగేశ్ తకవాలె (45), కోహ్లీ (38) పోరాడినా ఓటమి తప్పలేదు. తకవాలె, కోహ్లీ, యువరాజ్ (22),kolkatta-knight-rides డివిల్లీర్స్ (13)ల వికెట్లు ఖాతాలో వేసుకున్న సునీల్ నరైన్ (4/20) బెంగళూరు పతనాన్ని శాసించాడు. ఊతప్ప ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచాడు. రెండో ఓవర్లోనే క్రిస్ గేల్ (6)ను ఉమేష్ ఎల్బీడబ్ల్యుగా వెనక్కి పంపాడు. ఈ దశలో తకవాలె-కోహ్లీ జోడీ ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేసింది. మోర్కెల్ వేసిన 5వ ఓవర్‌లో తకవాలె మూడు బౌండ్రీలతో జోరు పెంచాడు. ఆనక వినయ్ బౌలింగ్‌లో కోహ్లీ ఫోర్ బాదగా, తకవాలె 6, 4 కొట్టాడు. దీంతో బెంగళూరు 12 ఓవర్లలో 90/1తో కోలుకుంది. సాఫీగా సాగుతున్న ఇన్నింగ్స్‌ను నరైన్ కోలుకోలేని దెబ్బతీశాడు. ఒకే ఓవర్‌లో ప్రమాదకర కోహ్లీ, తకవాలెను అవుట్ చేసి నరైన్ కోల్‌కాతాకు బ్రేక్ ఇచ్చాడు. చివర్లో బెంగళూరు విజయానికి 30 బంతుల్లో 90 పరుగులు చేయాల్సిన దశలో యువీ (22), డివిల్లీర్స్ (13)ని నరైన్ ఒకే ఓవర్లో అవు్ట్ చేయడంతో బెంగళూరు ఓటమి ఖాయమైంది. అంతకు ముందు – రాబిన్ ఊతప్ప రాయల్ చాలెంజర్స్ బౌలర్లను ఉతికి ఆరేశాడు. అతను 51 బంతుల్లో 83 పరుగులు చేశాడు. దాంతో కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 195 పరుగుల భారీ స్కోరు సాధించింది. షకీబ్ అలీ హసన్ అతనికి మంచి తోడ్పాటు అందించాడు. 38 బంతుల్లో 60 పరుగులు చేసి అహ్మద్ బౌలింగులో అవుటయ్యాడు. ఆదిలోనే గౌతం గంభీర్ అవుటైనప్పటికీ వారిద్దరు కోల్‌కతా భారీ స్కోరు సాధించడంలో కీలకమైన పాత్ర పోషించారు. రాయల్ చాలెంజర్స్ బెంగళూర్‌ బౌలర్లలో దిండా, స్టార్క్, అహ్మద్ తలో వికెట్ తీసుకున్నారు. అంతకు ముందు – కోల్‌కతా నైట్ రైడర్స్‌పై రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. గురువారంనాడు జరుగుతున్న మ్యాచులో ఆదిలోనే కోల్‌కతాకు ఆదిలోనే తీవ్రమైన దెబ్బలు తగిలాయి.కోల్‌కతా 56 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. దూకుడుగా ఆడుతూ వచ్చిన యూసుఫ్ పఠాన్ 13 బంతుల్లో 22 పరుగులు చేసి రన్నవుట్ అయ్యాడు. కెప్టెన్ గౌతం గంభీర్ ఐదు పరుగుల వద్ద అవుటయ్యాడు. ఆ తర్వాత పాండే దిండా బౌలింగులో 13 పరుగులు చేసి అవుటయ్యాడు. గౌతం గంభీర్ కేవలం నాలుగు పరుగులు చేసి స్టార్క్ బౌలింగులో అవుటయ్యాడు. రాబిన్ ఊతప్ప ట్వంటీ20లో కొత్త రికార్డు సృష్టించాడు. వరుసగా ఎనిమిదిసార్లు 40, అంతకు ఎక్కువ పరుగులు సాధించిన క్రీడాకారుడిగా ప్రపంచ రికార్డు సృష్టించాడు.

Leave a Comment