ఉదయం 6 గంటల నుంచే గాలింపు చర్యలు

himachal pradeshమండి : హిమాచల్ ప్రదేశ్లోని బియాస్‌ నదిలో గల్లంతైన విద్యార్ధుల గాలింపు కార్యక్రమం ఏడో రోజు కూడా ముమ్మరంగా సాగుతోంది. మునుపెన్నడూ లేని విధంగా మూడు డ్యాంలలోని నీటి విడుదలను నిలిపివేసి విద్యార్ధుల కోసం వెతుకుతున్నారు. ఆర్మీ, ఎస్ఎస్పీ, ఐటీజీపీ, ఎన్డీఆర్ఎఫ్ బలగాలు గాలిస్తున్నాయి. 800మంది నిపుణులతో ఈరోజు ఉదయం ఆరు గంటల నుంచే గాలింపు చర్యలు చేపట్టారు. 30 బృందాలతో రెస్క్యూ ఆపరేషన్
 ముమ్మరంగా కొనసాగుతోంది.

మండీలోని మూడు డ్యామ్‌ల పరిధిలో నీటి ప్రవాహాన్ని క్రమక్రమంగా తగ్గించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రమాదానికి 3 కిలోమీటర్ల పరిధిలో ప్రతి అంగుళం వెతకాలని అధికారులు నిర్ణయించారు. గాలింపు చర్యలను హిమాచల్ మంత్రి అనీత్ శర్మ, తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, ఎంపీలు వినోద్, జితేందర్‌రెడ్డి పర్యవేక్షిస్తున్నారు. ఇలా వుండగా ఈ ప్రమాదం హిమాచల్‌ ప్రదేశ్‌ సర్కారులో విప్లవాత్మక మార్కులకు నాంది పలికింది. నదీ తీర ప్రాంతాల్లో… హెచ్చరిక బోర్డులు వెలుస్తున్నాయి. నదికి దగ్గరగా వున్న ప్రాంతాల్లో మళ్ళీ ఇటువంటి ప్రమాదాలు జరగకుండా తగిన చర్యలు తీసుకుంటున్నారు.

Leave a Comment