ఉమ్మడి రాష్ట్ర అకౌంట్లను ఫ్రీజ్ చేసిన బ్యాంకులు..!

 

ఉమ్మడి రాష్ట్ర బ్యాంకు ఖాతాలు, స్థిర డిపాజిట్ ఖాతాల నిధులపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాల నుంచి విరుద్దమైన ప్రకటనలను వెలువడుతున్న నేపథ్యంలో బ్యాంకులు సాహసోపేత నిర్ణయాన్ని తీసుకున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఫిక్సిడ్ డిపాజిట్ అకౌంట్లను అన్నింటినీ స్థంభింపజేశాయి. ఇరు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య చిక్కుకుని నలిగిపోవడం కన్నా తామే అకౌంట్లను స్థంభింపజేస్తే ఎలాంటి గోడవ లేవనుకున్నాయి.  ఇరు రాష్ట్రాలు సంయుక్తంగా సర్కులర్ విడుదల చేస్తేనే తప్ప నిధులను విధిల్చమని బ్యాంకులు ఇరు రాష్ట్ర ప్రభుత్వాలకు స్పష్టం చేశారు. బ్యాంకర్ల సమావేశం ముగిసిన తరువాత తాము రెండు రాష్ట్రాలకు చెందిన బ్యాంకు అధికారులు, ప్రభుత్వ ప్రతినిధి బృందాలు రాష్ట్ర గవర్నర్ ఈ ఎష్  ఎల్ నరసింహన్ ను కలసి ఇదే విషయం తెలియజేశామని ఆంధ్రా బ్యాంకు సీఎండీ సీవీఆర్ రాజేంద్రన్ తెలిపారు. రెండు రాష్ట్రాలు సంయుక్తంగా సర్కులర్ విడుదల చేస్తేనే స్థిర డిపాజిట్ ఖాతాల నిధులను విడుదల చేస్తామని చెప్పారు. వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకులలో వున్న స్థిర డిపాజిట్, కరెంట్, సేవింగ్స్ అకౌంట్లలోని నిధులు తమకంటే తమకు చెందుతాయని రెండు రాష్ట్ర ప్రభుత్వాలు పోరాడతుండటంతో బ్యాంకులు ఈ అకౌంట్లను ఫ్రీజ్ చేశాయి. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లు కింద షెడ్యూల్ తొమ్మిది, పది కింద రెండు రాష్ట్ర ప్రభుత్వాలు నిధులను పంచుకోవాల్సి వుందన్నారు. కార్మిక శాఖకు చెందిన 400 కోట్ల రూపాయల నిధులను హైదరాబాద్ లోని ఆంధ్రాబ్యాంకు నుంచి విజయవాడలోని అదే బ్యాంకుకు ట్రాన్స్ ఫర్ చేయడంతో రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదానికి కారణమైంది. దీంతో తమ నిధులను ఆంధ్రప్రధేశ్ ప్రభుత్వం ఖాజేసిందని తెలంగాణ సర్కార్ అగ్రహాం వ్యక్తం చేసింది. ఆంధ్రప్రదేశ్  పునర్విభజన బిల్లును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో పాటు బ్యాంకులు కూడా ఉల్లంఘించాయని ఆరోపించింది. ఇకమీదట తమ అనుమతి లేకుండా బ్యాంకులు నిధులను బదిలీ చేయకూడదని అధేశాలు జారీ చేసింది. ఉమ్మడి రాష్ట్రానికి చెందిన స్థిర డిపాజిట్, కరెంట్, సేవింగ్స్ అకౌంట్లలో సుమారు 12 వేల కోట్ల రూపాయల మేర నిధులు పలు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో వున్నాయని సమాచారం. దీంతో రెండు రాష్ట్ర ప్రభుత్వాల తద్విరుద్దమైన ప్రకటనలతో విసిగిపోయిన బ్యాంకులు ఖాతాలన్నింటినీ స్థంబింపజేయాలని నిర్ణయించాయి. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా సర్కులర్ జారీ చేసిన మీదటే నిధులు విడుదల చేస్తామని తెలిపాయి. రెండు రాష్ట్రాల విరుద్ద ప్రకటనల నేపథ్యంలో ఊపిరిసల్పని బ్యాంకులు తొలుత స్తిర డిపాజిట్ అకౌంట్లతో పాటు కరెంటు, సేవింగ్స్ అకౌంట్లను కూడా స్థంభింపజేశాయి. అయితే ప్రభుత్వ ఉద్యోగులకు కూడా కరెంటు, సేవింగ్స్ అకౌంట్లలో నుంచే వేతనాలు చెల్లిస్తున్నామని, అందుచేత కరెంటు, సేవింగ్స్ అకౌంట్లను స్థంభింపజేయవద్దని కోరడంతో వాటిని బ్యాంకులు మినహాయించాయి. బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లుగా వున్న నిధులు ఎవరికి ఎంతెంత చేరుతాయన్న విషయం తేలాలంటే చాలా సమయం పడుతుందని, అప్పటి వరకు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడి సర్కూలర్ విడుదల చేస్తే తప్ప నిధులను విడుదల చేయమని బ్యాంకులు ప్రభుత్వాలకు స్పష్టం చేశాయి.

Leave a Comment