ఉరుగ్వేకు కోస్టారికా షాక్

soccer, Brazilస్టారికా : 3
 క్యాంప్‌బెల్: 54వ ని.
 డ్వార్టే: 50వ ని.
 యురేనా: 84వ ని.
 ఉరుగ్వే: 1
 కవాని: 24వ ని.
 
 3-1తో సంచలన విజయం
 ఫోర్టలెజా: ప్రపంచకప్‌లో మరో సంచలన విజయం నమోదైంది. గ్రూప్ ‘డి’లో అండర్‌డాగ్‌గా బరిలోకి దిగిన కోస్టారికా జట్టు తమ తొలి మ్యాచ్‌లో రెండుసార్లు చాంపియన్ అయిన ఉరుగ్వేకు షాకిస్తూ 3-1 తేడాతో విజయం సాధించింది. కోస్టారికా తరపున జోయెల్ క్యాంప్‌బెల్, ఆస్కార్ డ్వార్టే, మార్కో యురేనాలు ఒక్కో గోల్ నమోదు చేయగా… ఉరుగ్వేలో ఎడిన్సన్ కవాని ఏకైక గోల్‌ను సాధించాడు. 24వ నిమిషంలోనే లభించిన పెనాల్టీని ఎడన్సన్ కవాని గోల్‌గా మలిచి ఉరుగ్వేకు ఆధిక్యాన్నందించాడు.

ఆ తరువాత హోరాహోరీ పోరు కొనసాగినా.. ద్వితీయార్ధంలో కోస్టారికా అనూహ్య రీతిలో విజృంభించింది. మూడు నిమిషాల వ్యవధిలో రెండు గోల్స్ నమోదు చేసి ఉరుగ్వేను ఒత్తిడిలోకి నెట్టింది. 54వ నిమిషంలో క్యాంప్‌బెల్ అద్భుత రీతిలో బంతిని దొరకబచ్చుకొని గోల్ సాధించాడు. అనంతరం 57వ నిమిషంలో డ్వార్టే.. డైవింగ్ హెడర్‌తో రెండో గోల్‌ను అందించి కోస్టారికాను సంబరాల్లో ముంచెత్తాడు. ఆ తరువాత స్కోరును సమం చేసేందుకు ఉరుగ్వే తీవ్రంగా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.

 సమయం ముగిసిపోతుండడంతో ఉరుగ్వే ఆటగాళ్లు ఒత్తిడికి లోనై నియంత్రణ కోల్పోయారు. దీన్ని సొమ్ము చేసుకుంటూ 84వ నిమిషంలో క్యాంప్‌బెల్ ఇచ్చిన పాస్‌ను అందుకున్న యురేనా.. బంతిని గోల్‌కీపర్‌కు అందకుండా నెట్‌లోకి పంపించి కోస్టారికాకు మూడో గోల్‌ను అందించాడు. చివరికి అసహనానికి గురైన మ్యాక్సీ పెరీరా.. క్యాంప్‌బెల్‌పై దాడికి దిగి రెడ్‌కార్డుకు గురయ్యాడు. ఈ మ్యాచ్‌లో స్టార్ స్ట్రయికర్ లూయిస్ స్వారెజ్ ఆడకపోవడం ఉరుగ్వే అవకాశాలను తీవ్రంగా దెబ్బతీసిం

Leave a Comment