ఎగిరే కారు.. బాగుంది సారూ..

carఎగిరే కార్లు కొన్ని వచ్చాయి.. మరికొన్ని డిజైన్లు వచ్చాయి. ఇది మాత్రం వాటన్నిటికన్నా స్టైలిష్ అని చెప్పక తప్పదు.. హాలీవుడ్ సినిమాలో బ్యాట్‌మాన్ వినియోగించే వాహనంలా ఉన్న ఈ జీఎఫ్ 7 డిజైన్‌ను అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన గ్రెగ్ బ్రౌన్, డేవ్‌లు రూపొందించారు. గాలిలోకి ఎగిరేటప్పుడు ఈ కారుకుండే రెక్కలు విచ్చుకుంటాయి.

నేలపై ఎలక్ట్రిక్ మోటార్ల సాయంతో నడిచే ఈ వాహనం.. గాలిలో జెట్ ఇంజిన్ సాయంతో ఎగురుతుంది. గాలిలో ఎగిరేటప్పుడే.. ఇందులోని జెట్ ఇంజిన్ ఎలక్ట్రిక్ మోటార్ల తాలూకు బ్యాటరీని రీచార్జ్ చేస్తుంది. జీఎఫ్ 7 మార్కెట్లోకి రావడానికి మరో నాలుగేళ్ల సమయం పడుతుందని గ్రెగ్, డేవ్‌లు చెబుతున్నారు. నేలపై గంటకు 180 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోయే ఈ జీఎఫ్ 7.. ఆకాశంలో 885 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. దీని ధర రూ.17-30 కోట్ల మధ్య ఉండవచ్చు

Leave a Comment