మహానటుడు ఎన్టీఆర్ నటించిన సూపర్ హిట్ చిత్రం బందిపోటు కాగా మళ్ళీ ఇన్నాళ్ళ తర్వాత అల్లరి నరేష్ హీరోగా మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో ఈవివి బ్యానర్ పై ఈవివి తనయులు రాజేష్ -నరేష్ లు సంయుక్తంగా నిర్మించిన చిత్రం ”బందిపోటు”. ఈ చిత్రం ఈనెల 20న రిలీజ్ కానుంది. బందిపోటు చిత్రం ప్రేక్షక మహాశయులను అలరిస్తుందని పైగా సీనియర్ ఎన్టీఆర్ నటించిన హిట్ చిత్రం కాబట్టి ఆ చిత్రానికి ఏమాత్రం ఇబ్బంది కలగకుండా ,చెడ్డ పేరు రాకుండా మా చిత్రాన్ని రూపొందించమని తప్పకుండా హిట్ అవుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నాడు అల్లరి నరేష్. ఇక ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ కి ట్రిబ్యూట్ చేసే విధంగా రూపొందించామని చెబుతున్నారు అయితే అది ఏంటి ? ఎలా ? అన్నది తెలియాలంటే మాత్రం సినిమా చూడాల్సిందే అని అంటున్నారు .
Recent Comments