ఎన్నారై టి.ఆర్.యస్ సెల్ ఆద్వర్యం లో వివిద దేశాల్లో(యు.కే – London, బహరెన్, మస్కట్) లో “తెలంగాణా తొలి ముఖ్యమంత్రి కెసిఆర్ “ జన్మదిన వేడుకలు

ఎన్నారై టి.ఆర్.యస్ సెల్ ఆద్వర్యం లో వివిద దేశాల్లో(యు.కే – London, బహరెన్, మస్కట్)   లో “తెలంగాణా తొలిముఖ్యమంత్రి  కెసిఆర్ “ జన్మదిన వేడుకలు   ఘనంగా నిర్వహించారు.

 

London :

యు.కే నలుమూలల నుండి భారీగా తెరాస కార్యకర్తలు, తెలంగాణా వాదులు హాజరయ్యారు.

 

ఎన్నారై టి.ఆర్.యస్ సెల్ లండన్ ఇంచార్జ్ రత్నాకర్ ఆద్వర్యం లో నిర్వహించిన ఈ కార్యక్రమం  ఘనంగా జరిగింది.

 

ముందుగా కేకు కట్ చేసి  కెసిఆర్ గారికి  జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు, తరువాత

ఎన్నారై. టి.అర్.యస్ అద్యక్షులు అనిల్ కూర్మాచలం మాట్లాడుతూ , ఎంతో బిజీగా ఉన్నపటికీ   కార్యక్రమానికి వచ్చినందుకు తెరాస కార్యకర్త లకు, ఇతర సంస్థల ప్రతినితులకు, ప్రవాస తెలంగాణా బిడ్డలకు  కృతఙ్ఞతలు తెలిపారు.  మనం కలలు కన్న బంగారు తెలంగాణ కోసం కెసిఆర్ గారు ఆహార్ నిశలు కష్టపడ్తున్నారని ఎటువంటిసందేహాలు అవసరం లేదని హామీ   ఇచ్చారు.  ఎన్నారై టి.అర్.యస్ సెల్ కి ఎప్పటికప్పుడు కెసిఆర్ గారు మరియు యావత్ టి.అర్.యస్ నాయకులు,ఇస్తున్న ప్రోత్సాహానికి కృతఙ్ఞతలు తెలిపారు. కెసిఆర్ గారి  ఆదేశాల మేరకు పునర్నిర్మాణం లో కూడా వారి వెంట ఉంటామని తెలిపారు.

అలాగే ప్రపంచ వ్యాప్తంగా తెలంగాణా బిడ్డ ఎక్కడుం టే అక్కడ ఎన్నారై టి. ఆర్. యస్ శాఖలు ఏర్పాటు చేసి గులాబిమాయం చేస్తామని, ప్రత్యేకించి టి. ఆర్. యస్ ఎంపీ శ్రీమతి కవిత గారి ప్రోత్సహానికి కృతజ్ఞతలు తెలిపారు.

తెలంగాణా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన   పథకాల గురించి వివరించారు. టి.అర్.యస్ ప్రబుత్వం ప్రతి ఒక్కరిని కలుపుకొని అందరి సూచనలని తీసుకొని ముందుకు వెతుందని కాబట్టి మీరు కూడా ఎటువంటిసలహాలు అయిన లేదా సందేహాలు ఉన్న వ్యక్తిగతంగా  కాని, సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వాన్ని కాని సంప్రదించవచ్చు అని తెలిపారు. ప్రతి తెలంగాణా బిడ్డ కెసిఆర్ గారి నాయకత్వాన్ని బలపర్చడం చారిత్రక అవసరమని పిలుపునిచ్చారు.

 

చివరికి నూతనంగా ఎన్నికైన హైద్రాబాద్ మేయర్ – డెప్యుటీ మేయర్ బొంతు రామ్మోహన్ గారికి, ఫసియొద్దిన్ గారికి అలాగే గెలిచిన ప్రతి కార్పోరటోర్ కి శుభాకాంక్షలు తెలిపారు.

కార్యక్రమంలో అద్యక్షులు అనిల్ కూర్మాచలం, ఉపాద్యక్షులు మంద సునీల్ రెడ్డి, ప్రదాన కార్యదర్శి అశోక్ గౌడ్  దూసరి,  కార్యదర్శి నవీన్ రెడ్డి & వెంకట్ రెడ్డి దొంతుల , , లండన్ ఇన్‌ఛార్జ్ రత్నాకర్, వెస్ట్ లండన్ ఇన్‌ఛార్జ్ మధు సుధన్ రెడ్డి,తెలంగాణా ఎన్నారై ఫోరం (TeNF) అద్యక్షులు సిక్క చంద్రశేకర్ , ఉపాద్యక్షురాలు పవిత్ర రెడ్డి కంది, ఐ .టి జాక్ ఛైర్మన్ వెంకట్ రెడ్డి ,ముక్య నాయకులు శ్రీధర్ రావు,  శ్రీకాంత్ జెల్ల, సతీష్ బండ,సెరు సంజయ్, రాజేష్ వర్మ,సుమ దేవి,శ్వేతా,హాజరైన వారిలో ఉన్నారు.

Bahrain :

బహరైన్ శాఖ ఆద్వర్యం లో :

  1. రక్త దాన కార్యక్రమం
  2. తెలంగాణా బిడ్డలు నివసించే ప్రాంతం లో పండ్ల పంపిణీ
  3. కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.

బహరైన్ కో ఆర్డినేటర్  Radharapu. Sathish Kumar. తో పాటు హాజరైన సబ్యులు Bolisatty. Venkatesh,Raju,Sudhakar.,Rajesh,Prakash,Prabhakar,Prashanth and Sanjeev.

kcr1

Leave a Comment