ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్న టీ.టీడీపీ

శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గం లో పార్టీ బలపరిచిన అభ్యర్థుల గెలుపుకోసం తెలుగుదేశం పార్టీ అధ్యక్షు డు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఆదేశంతో తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు నిద్రమత్తును వీడారు. తెలంగాణాలో జరిగే రెండు ఎమ్మెల్సీ (పట్టభద్రుల) నియోజవర్గంలో పార్టీ బలపరిచిన అభ్యర్థుల గెలుపుకోసం జిల్లా, నియోజకవర్గ పార్టీ బాధ్యులు ప్రత్యేక దృష్టిసారించారు. రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించినట్లు గ్రేటర్‌ పార్టీ అధ్యక్షుడు సి.కృష్ణయాదవ్‌ తెలిపారు. హైద రాబాద్‌ జిల్లా పరిధిలోని 15 నియోజకవర్గాలలో 157పోలింగ్‌ స్టేషన్లు, 87,208మంది ఓటర్లున్నారని తెలిపారు. టీడీపీ బలపరిచిన బీజేపీ అభ్య ర్థి రామచందర్‌రావును అత్యధిక మెజారిటీతో గెలిపించేందుకు ప్రణాళిక బద్ధంగా చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

జిల్లా ఎన్నికల పర్యవేక్షకులుగా రాష్ట్ర పార్టీ నియమించిన ఇనుగాల పెద్దిరెడ్డి, జిల్లా అధ్యక్షుడు సి.కృష్ణ యాదవ్‌ నియోజకవర్గ సమావేశాల్లో పాల్గొని ఎన్నికల రణరంగానికి కార్యకర్తలు, పార్టీ శ్రేణులను సిద్ధం చేయనున్నారు. 14న అంబర్‌పేట, ముషీరాబాద్‌, కార్వాన్‌ నియోజకవర్గాలలో సమావేశాలు నిర్వహించను న్నట్లు కృష్ణయాదవ్‌ తెలిపారు. అలాగే 15న 11గంటలకు ఖైరతాబాద్‌, 12గంటలకు జూబ్లీహిల్స్‌, 1.0గంటకు సనత్‌నగర్‌, 2గంటలకు సికిం ద్రాబాద్‌, 3గంటలకు కంటోన్మెంట్‌, 4.0గంటలకు గోషామహాల్‌, 6 గం టలకు నాంపల్లి, రాత్రి 7 గంటలకు మలక్‌పేట, 8 గంటలకు యాకుత్‌ పుర, బహదూర్‌పుర, చాంద్రయణ గుట్ట నియోజకవర్గాలలో సమావేశా లు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశానికి ఎమ్మెల్సీ అభ్యర్థి రామచందర్‌రావు కూడా పాల్గొన నున్నట్లు తెలిపారు.

Leave a Comment