ఎయిడ్స్ బారిన పడ్డ హీరోయిన్

Nisha-Noor-AIDSఒకప్పుడు టాప్ స్టార్స్ తో నటించిన హీరోయిన్ నిషా  ఎయిడ్స్ వ్యాధి బారిన పడి చావు బతుకుల మద్య కొట్టుమిట్టాడుతోంది. 80వ దశకంలో టాప్ స్టార్స్ అయిన రజనీకాంత్ ,కమల్ హాసన్ లతో నటించిన నిషా కి ఎయిడ్స్ వ్యాధి సోకింది. అప్పట్లో మంచి కండ పుష్టితో ఉన్న నిషా నేడు పూర్తిగా బక్కచిక్కి అస్థిపంజరం లా ఉంది. ఆమె ఎంత దయనీయ పరిస్థితుల్లో ఉందంటే ఓ మూలాన పడేసి ఉంది దానికి తోడూ ఆమె పై చీమలు ,ఈగలు వాలుతూ చెప్పనలవి కానీ పరిస్థితిలో ఉందట . తమిళ నాడులోని నాగపట్టణం నాచుర్ గ్రామానికి చెందిన నిషా అక్కడ దయనీయంగ ఉన్న ఫోటోలను కొంతమంది వాట్సప్ లో షేర్ చేయగా జాతీయ మానవ హక్కుల సంఘం సభ్యుడు ,న్యాయమూర్తి అయిన మురుగేషన్ కు కూడా ఈ ఫోటోలు చేరడం తో తీవ్రంగా చలించి వెంటనే ఆమెని ఆసుపత్రిలో చేర్పించి సరైన వైద్య సదుపా యాలు కల్పించాల్సిందిగా ఆదేశించారట .80వ దశకం లో రజనీకాంత్ తో రాఘవేంద్ర ,కమల్ హాసన్ తో టిక్ టిక్ టిక్ చిత్రాల్లో నటించడమే కాకుండా పలు చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం హీరోయిన్ నిషా చావు బతుకుల మద్య ఉంది.

Leave a Comment