ఎల్ & టి చేతికి మోడీ కలల ప్రాజెక్ట్!

దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అత్యతంత ప్రతిష్టాత్మకంగా నిర్మించ తలపెట్టిన స్టాట్యూ ఆఫ్ యూనిటి కోసం మొత్తం 2979 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నట్టు గుజరాత్ ముఖ్యమంత్రి ఆనంది బెన్ తెలియజేశారు. దేశంలోనే అగ్రగామి సంస్థ ఎల్&టికి దీని నిర్మాణ బాధ్యతలు అప్పగించినట్టు ముఖ్యమంత్రి తెలిపారు. 182 మీటర్ల ఎత్తుండే భారత తోలి హొమ్ శాఖ మంత్రి.. సర్దార్ పటేల్ విగ్రహం తయారికోసం 1347 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్టు ప్రకటించారు. అలాగే.. ఎగ్జిబిషన్ హాలు, కన్వెన్షన్ సెంటర్ కోసం 235కోట్లు, విగ్రహం నుంచి గట్టు వరకు ఏర్పాటు చేయబోయే వంతెనకోసం మరో 83కోట్లు ఖర్చు చేయనున్నట్టు ఆమె తెలిపారు. ఇక నిర్మాణం పూర్తీఅయిన తరువాత 15సంవత్సరాల పాటు స్టాట్యూ ఆఫ్ యూనిటి నిర్వాహణ కోసం 657 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా తెలియజేశారు. ప్రపంచంలో ఎత్తైన విగ్రహం సర్దార్ పటేల్ విగ్రహమే అవుతుందని ఆమె తెలిపారు. న్యూయార్క్ లోని స్టాట్యూ ఆఫ్ లిబర్టి విగ్రహం ఎత్తు 93 మీటర్లు కాగ.. ఇప్పుడు గుజరాత్ లో నిర్మించబోయే స్టాట్యూ ఆఫ్ యూనిటి విగ్రహం ఎత్తు 182 మీటర్లు.

Leave a Comment