ఐటెం సాంగ్లు చేయను: విద్యాబాలన్

vidya balanముంబై : ‘ఫెరారీ కీ సవారీ’ చిత్రంలో ఐటెం సాంగ్లో డాన్సు చేసిన విద్యాబాలన్.. ఇక మీదట అలాంటి పాటలు చేసేది లేదని స్పష్టం చేసింది. అవి చేయడం తనకు ఏమాత్రం ఇష్టం లేదని చెప్పేసింది. ‘బాబీ కో సబ్ మాలూమ్ హై’ అనే బ్లాగ్ ప్రారంభ కార్యక్రమంలో విద్యాబాలన్ పాల్గొంది. తాను నటించిన ‘బాబీ జాసూస్’ చిత్రం ప్రమోషన్ కోసం ఈ కార్యక్రమానికి వెళ్లింది.

అందులో ఆమె డిటెక్టివ్ పాత్ర పోషిస్తోంది. అక్కడే విలేకరులు ఆమెను భవిష్యత్తులో కూడా ఐటెం సాంగ్స్ చేస్తారా అని ప్రశ్నించగా, ఇక మీదట తనను ఎవరూ ఐటెం సాంగ్స్లో చూడలేరని స్పష్టం చేసింది. బాబీ జాసూస్ చిత్రం జూలై 4న విడుదల కానుంది. సమర్ షేక్ దర్శకత్వంలో దియా మీర్జా, ఆమె కాబోయే భర్త సాహిల్ సంగా కలిసి నిర్మించిన ఈ సినిమాలో అలీ ఫజల్ కూడా నటించాడు.

Leave a Comment