ఐపీఎల్ ఫిక్సింగ్: ఢిల్లీ కోర్టు సంచలన వ్యాఖ్యలు

dawoodchotashakeelన్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) స్పాట్ ఫిక్సింగ్ కేసులో ఢిల్లీ కోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. స్పాట్ ఫిక్సింగ్ వ్వవహారంలో అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం, చోటా షకీల్‌ల పాత్ర ఉన్నట్లు దర్యాప్తులో తేలిందని ఢిల్లీ కోర్టు మంగళవారం వ్యాఖ్యలు చేసింది.ఈ కేసులో దావూద్ ఇబ్రహీం, చోటా షకీల్ ఇద్దరూ కీలక ముద్దాయిలని, వీరిద్దరికి సంబంధించిన ఆస్తుల జప్తును పోలీసులు ఆగస్టులో పూర్తి చేశారని అడిషనల్ సెషన్స్ న్యాయమూర్తి నీనా భన్సల్ కృష్ణ తెలిపారు. ఈ కేసులో వీరికి నాన్ బెయిల్‌బుల్ వారెంట్లు జారీ చేశారు.

1993 ముంబై బాంబ్ బ్లాస్టుల కేసులో వీరిద్దరు ప్రధాన ముద్దాయిలు. బాంబ్ బ్లాస్టుల తర్వాత వీరు ఇండియాకు ఇంత వరకు రాలేదని పోలీసులు వెల్లడించారు. 1993 ముంబై బాంబు పేలుళ్ల కేసులో ఇప్పటికే వీరిద్దరి ఆస్తులను జప్తు చేశామని కోర్టుకు పోలీసులు తెలిపారు.స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారంలో వీరిద్దరి ఆస్తుల జప్తునకు మార్గనిద్దేశం చేయాలని కోర్టును ఢిల్లీ పోలీసులు కోరారు. ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసులో జులై 30, 2013న దావూద్ ఇబ్రహీం, చోటా షకీల్‌పై ఛార్జి షీటు దాఖలు చేశారు ఢిల్లీ పోలీసులు.ఇండియాలో జరుగుతున్న క్రికెట్ బెట్టింగ్ వీరి కనుసన్నల్లోనే నడుస్తుందని ప్రధాన ఆరోపణ. అంతే కాకుండా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో స్పాట్ ఫిక్సింగ్‌లో వీరి హస్తం ఉందనేది ఆరోపణ. 2013లో జరిగిన ఐపీఎల్ – 6లో స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలను ఎదుర్కున్న క్రికెటర్లు శ్రీశాంత్, అజిత్ ఛండిలా, అంకిత్ చవాన్‌పై 6,000 పేజీల చార్జి షీటును ఢిల్లీ పోలీసులు దాఖలు చేశారు.

 

Leave a Comment