ఐపీఎల్7 ఫైనల్: కింగ్స్ ఎలెవన్ పంజాబ్ పై కోల్ కతా నైట్ రైడర్స్ విజయం

kkrబెంగళూరు: ఐపీఎల్7 టోర్నిలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుపై కోల్ కతా నైట్ రైడర్స్ విజయం సాధించింది. చివరి ఓవర్ దాకా సాగిన మ్యాచ్ లో అవానా బౌలింగ్ లో పీయూష్ చావ్లా విన్నింగ్ షాట్ కొట్టి కోల్ కతా కు విజయాన్ని అందించాడు. కోల్ కతా జట్టులో మనీష్ పాండే రాణించి 94 పరుగులు చేయగా, గంభీర్ 23, యూసఫ్ పఠాన్ 36, చావ్లా 13 పరుగులు చేశారు. కరణ్ వీర్ సింగ్ 4, జాన్సన్ 2 వికెట్లు పడగొట్టారు.
కోల్ కతా జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడంతో పంజాబ్ జట్టు బ్యాటింగ్ చేపట్టింది. పంజాబ్ జట్టులో సాహా 55 బంతుల్లో 115 పరుగులు చేయడంతో కోలకతా నైట్ రైడర్స్ జట్టు ముందు 200 పరుగుల లక్ష్యాన్ని ముందుంచింది.
30 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ పంజాబ్ జట్టును వోహ్రా, సాహాలు ఆదుకున్నారు. వోహ్రా 52 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్ల సహాయంతో 67 పరుగులు చేయగా, సాహా 55 బంతుల్లో 10 ఫోర్లు, 8 సిక్సర్ల సహాయంతో 115  పరుగులు సాధించాడు.
సెహ్వాగ్ (7), బెయిలీ(1), మాక్స్ వెల్(0) లు తక్కువ స్కోర్లతో అభిమానులను నిరాశపరిచారు. కోల్ కతా బౌలర్లలో చావ్లాకు రెండు వికెట్లు, ఉమేశ్ యాదవ్, నరైన్ చెరో వికెట్ దక్కింది.

Leave a Comment