ఐష్ పెళ్లయింది.. నాకు పిచ్చెక్కింది!!

wallpaper-2653ముంబై : ఐశ్వర్యారాయ్ మళ్లీ వార్తల్లోకి వచ్చింది. పెళ్లి, ఆరాధ్య పుట్టడం, మళ్లీ గర్భవతి అంటూ కథనాలు రావడం.. ఇవన్నీ ఒక ఎత్తయితే ఇప్పుడు శ్రీలంక జాతీయుడు ఒకరు చేస్తున్న ఆరోపణలు మరో ఎత్తు. ఒకప్పుడు తాను, ఐశ్వర్యారాయ్ ప్రేమించుకున్నామని… అయితే ఆమె కాస్తా అభిషేక్ బచ్చన్ను పెళ్లి చేసుకోవడంతో తనకు పిచ్చెక్కిందని శ్రీలంకకు చెందిన నిరోషన్ దేవప్రియ ఆరోపిస్తున్నాడు. అంతేకాదు, ఈ మేరకు ఓ ఫిర్యాదు కూడా దాఖలు చేశాడు.

తన కేసు వాదించడానికి ఒక న్యాయవాదిని కూడా పెట్టుకున్నట్లు సమాచారం. ఆ న్యాయవాదికి ఇవ్వాల్సిందిగా 17 లక్షల రూపాయలను తన మేనకోడలికి ఇవ్వగా, ఆమె ఆ డబ్బులు ఇవ్వకుండా ఎటో వెళ్లిపోయింది. దాంతో ఇప్పుడు నిరోషన్ అటు ఐశ్వర్య పెళ్లితో పాటు తన మేనకోడలి మోసంపై కూడా కోర్టులో కేసు దాఖలు చేశారు. వాయిదాల్లో ఆ డబ్బు మొత్తాన్ని నిరోషన్కు చెల్లించాలని కోర్టు అతడి మేనకోడలిని ఆదేశించింది. ప్రస్తుతం చైనాలో ఉంటున్న అతడు.. ఐశ్వర్య తనకు పిచ్చెక్కించిందంటూ పెట్టిన కేసు మాత్రం ఇంకా పెండింగులో ఉంది. ఐశ్వర్యకు అభిషేక్తో పెళ్లయ్యి ఇప్పటికి ఏడు సంవత్సరాలు గడిచిపోయి, వాళ్లిద్దరికీ ఓ బిడ్డ పుట్టి రెండేళ్లు అయిన తర్వాత ఇన్నాళ్లకు అతడికి కేసు విషయం గుర్తుకొచ్చింది.

Leave a Comment