ఒబామాను ఆశ్చర్యానికి గురిచేసిన మోడీ

30-09-20141412070200278254-dpz-30spab-14

 

అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామాకు భారత ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా బహుమతులు అందజేయడం ఒబామాను అబ్బురపరిచింది. గాంధీజీ రాసిన గీతా పుస్తకాన్ని ఖాదీ వస్త్రంలో ఉంచి మోడీ ఒబామాకు కానుకగా ఇచ్చారు. అలాగే 1959లో మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ భారత్‌ను సందర్శించినప్పటి వీడియో, ఆడియోలను ఒబామాకు బహూకరించారు. ఆఫ్రికన్‌-అమెరికన్‌ మానవ హక్కుల పోరాట నేత, గొప్ప నాయకుడైన మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ భారత్‌ పర్యటనలోని కొన్ని అపూర్వ చిత్రాలను మోడీ… ఒబామాకు అందజేశారు. ఈ బహుమతులు అందుకున్న ఒబామా ఎంతో సంతోషపడ్డారు. ఒబామా ఇద్దరు కుమార్తెలు సాషా, మలియాలకు కూడా మోడీ బహుమతులు తీసుకెళ్లినట్లు సమాచారం. ఇవి మోడీ వ్యక్తిగతంగా ఇచ్చిన బహుమతులని, అధికారిక బహుమతులు రేపు అందజేస్తారని విదేశాంగ శాఖ అధికారి ప్రతినిధి అక్బరుద్దీన్‌ తెలిపారు

Leave a Comment