కటక్ వన్డేలో ఇండియా ఘన విజయం…

కటక్ వన్డేలో శ్రీలంకను లక లక అనిపించింది టీమిండియా. బ్యాటింగ్, బౌలింగ్ రెండు విభాగాల్లో అదరగొట్టి 169 పరుగుల తేడాతో ఘన విజయం సాధిచింది. రహానె-ధావన్ -ఇద్దరూ సూపర్ సెంచరీలు చేయడంతో లంక ముందు 364 పరుగుల భారీ టార్గెట్ పెట్టిన కోహ్లీసేన.. బౌలింగ్ లోనూ అదరగొట్టింది. కీలక బౌలర్లు భువనేశ్వర్, షమీ లేకున్నా ఇషాంత్ సూపర్ షోతో యంగ్ ఇండియా టోర్నీలో బోణీ కొట్టింది. భారీ లక్ష్య చేధనలో లంక ఆరంభం నుంచి తడబడింది. ఓపెనర్లు మొదట బాధ్యతాయుతంగా బ్యాటింగ్ చేస్తున్నట్టు కనిపించినా భారీ స్కోర్లు చేయడంలో ఫెయిలయ్యారు. దీంతో 61 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన పర్యాటక టీం ఒత్తిడిలో పడింది. 43 పరుగులతో జయవర్థనే ఒక్కడే కాసేపు ఒంటరి పోరాటం చేసినా.. సహచరుల నుంచి సహకారం లేకపోయింది. ఇషాంత్ శర్మ విజృంభించడంతో లంక ఓటమి లాంఛనమైంది. మరో 64 బంతులు మిగిలుండగానే 194 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఇషాంత్ 4 వికెట్లు తీసి భారత విజయంలో కీ రోల్ పోషించాడు. ఐదు వన్డేల సిరీస్ లో భారత్ 4-1 ఆధిక్యం సాధించింది.

Leave a Comment