కబినెట్‌లో బెర్‌‌త కోసమే మోడీ భజన

కేంద్ర కేబినెట్‌లో చేరేందుకే టీఆర్‌ఎస్‌ ఎంపీ కవిత ప్రధాని మోదీ భజన చేస్తున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ షబ్బీర్‌ అలీ విమర్శించారు. రైల్వే బడ్జెట్‌లో తెలంగాణకు జరిగిన లబ్ది ఏమిటో టీఆర్‌ఎస్‌ చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు శుక్రవారం ఇక్కడ ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణకు కొత్త రైల్వే లైన్లు, ప్రాజెక్టులు సాధించడంలో భాగంగా కేంద్రంపై ఒత్తిడి తేవడంలో టీఆర్‌ఎంపీలు విఫలమయ్యారని విమర్శించారు. రైల్వే బడ్జెట్‌లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో టీఆర్‌ఎస్‌ ఎంపీలు జంతర్‌మంతర్‌ వద్ద నిరసన తెలపాలని డి మాండ్‌ చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌తో పోలిస్తే తెలంగాణకు కొంత మేర న్యాయం జరిగిందనీ కవిత వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

Leave a Comment