కరణ్ జోహార్ చేతిలో బాహుబలి

karanjohar630
టాలీవుడ్ లో రూపొందుతున్న అత్యంత భారి చిత్రం బాహుబలి. ఇప్పటికే ఈ సినిమా భారి అంచనాలతో పాటు అంతే క్రేజ్ ను సొంతం చేసుకుంది. షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు దగ్గర పడడం తో ఈ సినిమా బిజినెస్ కుడా అంతే క్రేజీ గా జరుగుతుంది.
ఇప్పటికే ఈ సినిమా తమిళ  హక్కులను మిర్చి సినిమా నిర్మాతలు యు వి క్రియేషన్స్ మరియు స్టూడియో గ్రీన్ సంస్తలు భారి మొత్తానికి ( 27 కోట్లు ) సొంతం చేసుకున్నాయి. అయితే హిందీలో కుడా ఈ సినిమా విడుదల చేస్తున్నారు కాబట్టి ఈ హిందీ హక్కులను ప్రముక దర్శకనిర్మాత కరణ్ జోహార్ సొంతం చేసుకున్నాడు.
కరణ్ కు బిజినెస్ పరంగా మంచి నెట్వర్క్ ఉండడం తో ఆయనకు ఈ హక్కులను ఇచ్చేసారట. ఏప్రిల్ లో ఈ చిత్రం విడుదల కానుంది.  ప్రభాస్ , రానా , అనుష్క , తమన్నా ముక్య పాత్రల్లో నటిస్తున్నారు.

Leave a Comment