కసాయికి ఆహ్వానమా?

DMKన్యూఢిల్లీ: నరేంద్ర మోడీ ప్రమాణస్వీకారోత్సవానికి శ్రీలంక అధ్యక్షుడు మహింద రాజపక్సెను ఆహ్వానించడంపై తమిళ రాజకీయ పార్టీ నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇప్పటికే డీఎంకే, అన్నాడీఎంకే దీనిపై తమ నిరసన తెలిపాయి. తాజాగా ఎన్డీఏ భాగస్వామ్య పక్షమైన ఎండీఎంకే కూడా ఈ నిర్ణయంపై పునరాలోచించాలని సూచించింది.

ఎండీఎంకే నాయకుడు వైగో ఈ మేరకు శుక్రవారం నరేంద్ర మోడీ, బీజేపీ అధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్ లను కలిసి విజ్ఞప్తి చేశారు. అమిత్ షా, అరుణ్ జైట్లీ సమక్షంలో మోడీని వైగో కలిశారు. తమిళులను ఊచకోత కోసిన కసాయి రాజపక్సను ప్రమాణస్వీకారోత్సవానికి ఆహ్వానించవద్దని మోడీని కోరినట్టు వైగో తెలిపారు. మోడీ నుంచి ఎటువంటి స్పందన వచ్చిందన్న ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పలేదు.

Leave a Comment