కాశ్మీర్ అంశం చర్చించండి!

అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా వచ్చే ఏడాది గణతంత్ర్య దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిధిగా భారతదేశానికి వస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఇదే అంశాన్ని ఒబామా పాకిస్థాన్ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ తో స్వయంగా ఫోన్ చేసి మరీ చెప్పినట్లు తెలుస్తోంది. ఇక ఈ నేపధ్యంగా షరీఫ్ కాశ్మీర్ అంశంపై చర్చలు జరిపేందుకు భారత్ ససేమిరా అంటుండడంతో భారత్ పర్యటనలో ఈ అంశాన్ని ఎలాగైనా చర్చించాలని ఒబామాను కోరారని సమాచారం. కాగా ఇదే విషయాన్ని పాకిస్థాన్ పీఎంఓ కార్యాలయం స్పష్టం చేస్తూఒక ప్రకటనలో తెలిపింది. ఇక కాశ్మీర్ విషయంపై చేసిన తీర్మానం వలన శాంతి, స్థిరత్వం, దక్షిణ ఆసియా ప్రాంతానికి ఆర్ధిక సహకారం లభిస్తుందని నవాజ్ షరీఫ్, అమెరికా అధ్యక్షుడు ఒబామాకు వివరించినట్లు పాక్ పీఎంఓ తన ప్రకటనలో పేర్కొంది.

Leave a Comment