కుర్చీ కాళ్ళు

2014 ఎన్నికల్లో తనని ఓడించినందుకు ఓటర్లకి జగన్మోహన్ రెడ్డి ఋణపడి ఉండాలి!

ఇది “సూర్యుడు వెలుగు ఇస్తాడు” అన్నంత నిజం!

ఎన్నికల వాతావరణంలో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రజలలో నడుస్తున్న ప్రధాన చర్చలలో ఇదీ ఒకటి!

ఇప్పటి ఉత్తర భారతం కేంద్ర రాజకీయాల ప్రకారం స్థానికంగా ఎవరు బలహీనంగా ఉంటే వారిని బలమైన వారి మీదకి ఉసిగొలిపే కధ నడుస్తోంది…

ప్రస్తుతం, ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ పీఠానికి మొదటి ప్రధాన అడ్డంకి చంద్రబాబు రూపంలో ఉంది. విభజనానంతర ఆంధ్రప్రదేశ్ అత్యవసర కార్యసాధన ఆధారంగా అధికారం పొందిన చంద్రబాబు మీద తీవ్రమైన అవినీతి కేస్ లు లేవు…అప్రకటిత ఆస్తులు లేవు…ఉన్న ఒకే ఒక ఓటు-నోటు కేస్ ఆంధ్ర లో పెట్టుబడులకి నష్టం చేసింది కానీ బాబు పైన ఏ ప్రభావం చూపించే అస్త్రంగా నిలబడే అవకాశాలు లేవని న్యాయస్థానాలే తేల్చేశాయి!

కాబట్టి,

ఆంధ్రలో బీజేపీ కి స్థానికంగా ఉన్న ప్రస్తుత ప్రశ్నలు అధికార అభ్యర్థులు అయిన చంద్రబాబు జగన్ లే!

చంద్రబాబు బలంగా ఉండేటప్పటికి జగన్ ని పరోక్షంగా కేస్ ల నుండీ కాపాడుతూ జగన్ ద్వారా చంద్రబాబు ని ఇబ్బందులు పెట్టటం 5 ఏళ్లుగా బి‌జే‌పి అమలు చేస్తున్న బహిరంగ రహస్య వ్యూహం అని ఢిల్లీలో జాతీయ పార్టీల పెద్దలు బాహాటంగానే చెపుతున్నారు!

మోడీ ప్రధాని అయ్యాక బి‌జే‌పి వలన నష్టపోని మిత్రపక్షం లేదు, సూటిగా చెప్పాలంటే బి‌జే‌పి దృష్టిలో మిత్రపక్షాలు అన్నీ శతృపక్షాలే!

ఇప్పటి వరకూ మోడీ వ్యవహారశైలిని బట్టి చూస్తే, ఒకవేళ 2014 లో జగన్ గెలిచి ఉంటే ఈ పాటికి అన్నమాట ప్రకారం “సంవత్సరంలోగా కుంభకోణాల నాయకులందరికి శిక్షలు ప్రకటించి జైలుకి పంపేవారు” అనేది నిర్వివాదాంశం.

2014 ఎన్నికల ఫలితాలు తేలి బి‌జే‌పి కి సొంత బలంతో కేంద్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చెయ్యగలమని స్పష్టత వచ్చేవరకూ మోడీ దేశవ్యాప్తంగా మిత్ర ప్రేమని ప్రదర్శించారు. మరొక 2 రోజుల్లో, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం హామీలు మన్మోహన్ సింగ్ రాజ్యసభలో చెపుతారనగా,..ఆంధ్ర నుండి గొట్టాలు వేసి ఆంధ్ర గ్యాస్ మాత్రమే తోడే అలవాటున్న ఈ గుజరాతీ  హఠాత్తుగా “బిడ్డని బతికించి తల్లిని చంపేశారు” అంటూ ఆంధ్ర ఆత్మీయగానంతో ఓట్లు తోడటం మొదలుపెట్టాడు! ఇప్పుడు, వాస్తవికత చూస్తే, విభజించటానికి కాంగ్రెస్ చేత వినియోగించబడిన ఆంధ్ర ఉమ్మడి గవర్నర్ నరసింహన్ కాంగ్రెస్ వాడైనా సరే ఆంధ్ర ని అణచివెయ్యటానికి మోడీ చేత రెండవ పర్యాయం దురుద్దేశ్యపూర్వకంగా కొనసాగించబడ్డాడు. హైద్రాబాద్ ఆస్తులు, ఆంధ్ర హక్కులు, విద్యుత్ అక్రమ పంపిణీ ఆపైన బకాయిలు, నదీజలాల వాటాల అంశాలలో ఆంధ్రప్రదేశ్ కి అన్యాయం చేస్తూ ఇప్పటికీ కొనసాగించబడుతున్నాడు. ఇది ఒక్కటే కాక ప్రతీ విభజన గాయాన్ని పెద్దది చేయటంలో మోడీ కృషి, నైపుణ్యం మరియు పట్టుదల అందరం చూస్తూనే ఉన్నాము.

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందితే గుజరాతి కార్పొరేట్ సంస్థలు ఆంధ్రలోని ప్రకృతి వనరుల మీద పట్టు కోల్పోక తప్పదు  కాబట్టి ఆంధ్రప్రదేశ్ అస్థిరంగా ఉండాలనే ఉమ్మడి సంకల్పంతో ఉత్తరాది నాయకులు తెలుగు రాష్ట్రాన్ని రాజధాని లేకుండా రోడ్ మీదకి నెట్టారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

కాగా, జగన్ కాంగ్రెస్ సోనియాతో ఇప్పటికే వైరం పెట్టుకుని ఉండటంతో కేంద్రంలో కాంగ్రెస్ కూటమి రావటాన్ని జీర్ణించుకునే పరిస్తితి లేకపోగా   ముఖ్యమంత్రి అయిన మరుక్షణం 11 కేస్ ల విచారణ ఎదుర్కుంటున్న జగన్మోహన్ రెడ్డి బి‌జే‌పి కి కూడా సులభ లక్ష్యంగా మారకతప్పదు.

ఎందుకంటే, భావసారూప్యత ఉన్న శివసేనని ఒకసారి బురిడి కొట్టించిన మోడీ తానేమిటో మొదటిపర్యాయంలోనే నిరూపించుకున్నాడు… రానున్న ఎన్నికల్లో చంద్రబాబు ఓడిపోతే బీజేపీ కి ఇద్దరు స్థానిక శత్రువుల్లో ఒకరు తగ్గినట్లే!

ఆపై, 2 లేక 3 ఏళ్లలో జగన్ కేస్ లు కొలిక్కి తెచ్చి జగన్ అడ్డు కూడా తొలగించుకుని ఏ కీలు బొమ్మ నో కూర్చోపెడతారు…

దీని అర్దం చంద్రబాబు అధికారంలో ఉండి జగన్ ప్రతిపక్ష కక్ష్యలో ఉంటేనే బీజేపీ జగన్మోహన్ రెడ్డి కి ఉపశమనంగా ఉంటుంది అన్నమాట!

Leave a Comment