కేజ్రీవాల్.. ఖైదీ నెంబర్ 3642

61400926721_625x300న్యూఢిల్లీ: ఆయన ఒకప్పుడు అఖిల భారత సర్వీసు అధికారి. ఆ తర్వాత పోరాట యోధుడిగా మారారు. ఢిల్లీ ఎన్నికల్లో సంచలన విజయం సాధించి ముఖ్యమంత్రి పీఠం అధిరోహించారు. తాజాగా పరువు నష్టం కేసులో తీహార్ జైల్లో ఉన్నారు. రిమాండ్ ఖైదీగా ఉన్న ఆయనకు 3642 నెంబర్ కేటాయించారు. ఆయనెవరో ఈపాటికి అర్థమై ఉంటుంది. అతనే ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, సంచలనాల అరవింద్ కేజ్రీవాల్.

బీజేపీ మాజీ అధ్యక్షుడు నితిన్ గడ్కరీ వేసిన పరువు నష్టం దావా కేసులో కేజ్రీవాల్ ఇటీవల కోర్టుకు హాజరయ్యారు. బెయిల్ తీసుకునే అవకాశం ఉన్నా..  కేజ్రీవాల్ నిరాకరించారు. దీంతో కోర్టు ఆయన్ను రిమాండ్కు ఆదేశించడంతో తీహార్ జైలుకు తరలించారు. కాంగ్రెస్ విధానాలతో వ్యతిరేకించిన కేజ్రీవాల్ ముఖ్యమంత్రి అయిన కొద్ది రోజులకే రాజీనామా చేశారు. ఢిల్లీ ముఖ్యమంత్రిగా అధికార నివాసంలో ఉండాల్సిన కేజ్రీవాల్ కు.. దుడుకు స్వభావం, అనుచిత వ్యాఖ్యలతో తీహార్ జైల్లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

Leave a Comment