కేసీఆర్‌ను సీఎంగా వ్యతిరేకించాలి: మందకృష్ణ

హైదరాబా4ద్ : కేసీఆర్‌ను సీఎంగా వ్యతిరేకించాలని మహాజన్ సోషలిస్టు పార్టీ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. మంగళవారం  సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో దళిత సంఘాలు ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ మేరకు తీర్మానించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన మందకృష్ణ మాట్లాడుతూ తెలంగాణకు తొలి సీఎం దళితుడేనని పన్నెండేళ్లుగా నమ్మించి మోసం చేసిన కేసీఆర్ వైఖరిని ఎండగట్టారు. దళితులపై జరుగుతున్న అన్యాయాలపై ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఇప్పుడు ప్రశ్నించకపోతే భవిష్యత్‌లో ఉనికి కోల్పోయే ప్రమాదం ఉందన్నారు.

తెలంగాణ ఉద్యమంలో దళితుల పాత్ర ఎంతో ఉందని, ఉద్యమంలో పాల్గొన్న కళాకారుల్లో 90 శాతం వుంది, ఆత్మత్యాగం చేసుకున్న వారిలో 30 శాతం వుంది దళితులేనన్నారు. సమావేశంలో మహాజన సోషలిస్టు పార్టీ ప్రచార కార్యదర్శి రాగటి సత్యం, రాష్ట్ర అధ్యక్షులు భాస్కర్ మాదిగ, మాల మహానాడు నేత ఆగమయ్య, బీఎన్ నరేష్‌కుమార్, కాశన్న, ధర్మన్న బాబు, లాలయ్య, కె. శంకర్ పాల్గొన్నారు.

Leave a Comment