‘కేసీఆర్‌ వెనక్కి తగ్గడంపై రైతుల్లో ఆందోళన’

kహైదరాబాద్: రైతుల రుణమాఫీకి టీఆర్‌ఎస్‌ కట్టుబడి ఉండాలని తెలంగాణ సీఎల్పీ నేత కె జానారెడ్డి డిమాండ్ చేశారు. లక్ష రూపాయల లోపు రైతు రుణాలను మాఫీ చేస్తామన్న కేసీఆర్‌ ఇప్పుడు వెనక్కి తగ్గడంపై రైతుల్లో ఆందోళన నెలకొందని అన్నారు. రైతుల నమ్మకాన్ని వమ్ము చేయడం, ఇచ్చిన మాటను తప్పడం విశ్వాసఘాతుకమేనని అన్నారు.

ఒక ఏడాది పంట రుణాలను మాత్రమే మాఫీ చేస్తామన్న నిర్ణయాన్ని కేసీఆర్‌ సర్కార్‌ పునరాలోచించాలని సూచించారు. గతేడాది పంట రుణాలను మాత్రమే మాఫీ చేస్తామని నిన్న జరిగిన బ్యాంకర్ల సమావేశంలో కేసీఆర్ స్పష్టం చేసినట్టు వార్తలు వచ్చాయి.

Leave a Comment