కోడి రామకృష్ణ మరణం


దేశ చలనచిత్ర పరిశ్రమలో మొదటి గ్రాఫిక్స్ శైలి చిత్రాల ఘనాపాటి శ్రీ కోడి రామకృష్ణ మహాభినిష్క్రమణ చెశారు…

కొన్నేళ్ల క్రితం గుండెపోటుకి గురయ్యి చికిత్స పొందిన KRK,.. 2 రోజుల క్రితం ఊపిరితిత్తుల సమస్య తో శ్వాస తీసుకోవటానికి ఇబ్బంది మొదలవ్వటంతో కుటుంబీకులు
హైద్రాబాద్ లోని ఒక ప్రయివేట్ ఆసుపత్రికి తరలించగా…నిరంతరం ఆక్సిజన్ అందిస్తూ అత్యవసర సేవల విభాగంలో ఉంచారు. చెన్నై నుంచి వచ్చిన నిపుణుల పర్యవేక్షణ లో ఉన్న రామకృష్ణ, 2 గంటల క్రితం చేసిన అత్యవసర
వైద్య ప్రక్రియకు స్పందించకపోవటంతో వైద్యులు ఆయన మృతి చెందినట్లు ప్రకటించారు…
పాలకొల్లులో పుట్టి 120 కి పైగా చిత్రాలను నిర్ధేశించిన కోడి రామకృష్ణ ఇచ్చిన అమ్మోరు, అరుంధతి చిత్రాలు ఆంధ్ర చలనచిత్ర కథల ఎంపిక తీరునే ప్రభావితం చేశాయి… దేశంలోని
ఆధునిక అత్యుత్తమ సాంకేతిక చిత్రాల తయారీలో ఆంధ్రులు మొదటివరుసలో నిలబడటానికి ఈ ఊహాలోక రూపశిల్పి దృఢమైన పునాదులు వేశారు….
కోడి రామకృష్ణ మృతి చలనచిత్ర రంగంలో ప్రస్తుత మరియు భవిష్యత్ తరాలకు ఒక విజ్ఞాన నష్టం…

Leave a Comment