క్వార్టర్స్‌లో మన ప్రత్యర్థి బంగ్లాయే

అంతా ఊహించినట్టే ప్రపంచ కప్‌ క్వార్టర్స్‌లో భారత్‌ ప్రత్యర్థి బంగ్లాదేశ్‌ కానుంది. క్వార్టర్స్‌లో గ్రూపు-బి టాపర్‌ భారత్‌, గ్రూపు-ఎ 4వ స్థానంలో నిలిచిన బంగ్లా తలపడనున్నాయి.

ఈ నెల 21న వెల్లింగ్టన్‌లో జరిగే నాలుగో క్వార్టర్స్‌ పోరులో భారత్‌, బంగ్లా ఆడనున్నాయి. శుక్రవారం న్యూజిలాండ్‌, బంగ్లాదేశ్‌ల మధ్య జరిగిన మ్యాచ్‌ ఫలితంతో గ్రూపు-ఎలో తొలి నాలుగో జట్ల స్థానాలు ఖరారయ్యాయి.

కివీస్‌ అగ్రస్థానంలో నిలువగా.. బంగ్లా నాలుగో స్థానంలో నిలిచింది. ఈ గ్రూపులో కివీస్‌, ఆసీస్‌, శ్రీలంక, బంగ్లాదేశ్‌ ఇదివరకే నాకౌట్‌కు అర్హత సాధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతానికి కివీస్‌ (12), లంక (8), ఆసీస్‌ (7), బంగ్లా (7) వరుసగా టాప్‌-4లో ఉన్నాయి. కివీస్‌, శ్రీలంక, బంగ్లాదేశ్‌ లీగ్‌ దశ లో ఆరూ మ్యాచ్‌లూ ఆడేశాయి. ఆసీస్‌ మాత్రం చివరి మ్యాచ్‌ స్కా ట్లాండ్‌తో ఆడనుంది. ఈ మ్యాచ్‌లో అద్భుతం జరిగి కంగారూలు ఓడినా.. బంగ్లా కంటే మెరుగైన రన్‌రేట్‌ ఉన్నందున మూడో స్థానం లో ఉంటారు. గెలిస్తే రెండో స్థానానికి చేరుతారు. ఫలితం ఏదైనా కివీస్‌, బంగ్లా స్థానాల్లో మార్పు ఉండదు. ఇక ఇప్పటికే ఐదు విజయాలతో గ్రూపు-బి టాపర్‌గా ఉన్న భారత్‌ స్థానానికి ఎలాంటి ఢోకా లేదు. కాబట్టి క్వార్టర్స్‌లో ఉపఖండం జట్లు భారత్‌-బంగ్లా అమీతుమీ తేల్చుకోనున్నాయన్నమాట.

Leave a Comment