క్వార్టర్స్‌లో సైనా నెహ్వాల్

Saina Nehwal,జ్వాల-అశ్విని జోడి ఔట్  ఇండోనేసియా ఓపెన్ బ్యాడ్మింటన్
 
జకార్తా: ఇండోనేసియా ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ క్వార్టర్ ఫైనల్‌కు చేరింది. గురువారం జరిగిన రెండో రౌండ్‌లో సైనా 21-17, 21-9 తేడాతో కిర్‌స్టీ గిల్మర్ (స్కాట్లాండ్)పై విజయం సాధించింది. ఈ టోర్నీలో నాలుగో సారి టైటిల్ వేటలో మరో అడుగు ముందుకేసిన ఎనిమిదో సీడ్ సైనా.. క్వార్టర్స్‌లో టాప్‌సీడ్, చైనా క్రీడాకారిణి జురుయ్ లీతో తలపడనుంది. జురుయ్ లీ రెండో రౌండ్‌లో 21-12, 21-19తో అడ్రియంటి ఫిర్దాసరిపై నెగ్గి క్వార్టర్స్‌లో అడుగు పెట్టింది.

ఇరువురి మధ్య ఇప్పటిదాకా జరిగిన ముఖాముఖి పోరులో సైనాపై 6-2తో జురుయ్ లీదే పైచేయిగా ఉంది. అయితే ఇదే టోర్నీలో 2012 ఫైనల్లో జురుయ్ లీని ఓడించి విజేతగా నిలిచిన రికార్డు సైనా ఆత్మవిశ్వాసాన్ని పెంచనుంది. ఇక మహిళల డబుల్స్‌లో గుత్తా జ్వాల-అశ్వినీ పొన్నప్ప జోడి పోరాటం రెండో రౌండ్‌తోనే ముగిసింది. కొరియా జంట యీ నా జంగ్-సో యంగ్ కిమ్ చేతిలో జ్వాల-అశ్విని ద్వయం 16-21, 21-15, 12-21 తేడాతో ఓటమిపాలైంది.
 
 

Leave a Comment