గర్ల్స్ ఫోటోలు పంపిం…: ఫేస్‌బుక్ ద్వారా సెక్స్ రాకెట్

1పాట్నా: ఫేస్‌బుక్, మెయిల్స్ ద్వారా నడుస్తున్న ఓ సెక్స్ రాకెట్‌ను బీహార్ పోలీసులు రట్టు చేశారు. మైనర్ గర్ల్స్‌ను బలవతంగా వ్యభిచార కూపంలోకి నెట్టి.. వారితో ఉత్తర ప్రదేశ్, బీహార్, నేపాల్‌లలో బిజినెస్ చేస్తున్న నిందితులను అరెస్టు చేశారు. బీహార్ రాజధాని అయిన పాట్నాలో మూడు ప్రాంతాల్లో పోలీసులు దాడి చేసి నిందితులను అరెస్టు చేశారు. పాట్నాలోని గాంధీ నగర్ ప్రాంతంలో ఉంటున్న వ్యక్తి ఈ సెక్స్ రాకెట్ నడుపుతున్నట్లుగా పోలీసులు నిర్ధారించారు. అతను 13 ఏళ్ల నుండి 20 ఏళ్ల వరకు ఉన్న యువతులను ఈ కూపంలోకి బలవతంగా లాగుతున్నాడు. దాడులు నిర్వహించిన పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. ముగ్గురిలో ఒకరు రాజస్థాన్ రాష్ట్రంలోని జోద్‌పుర్‌కు చెందిన వాడిగా గుర్తించారు. ముగ్గురు అమ్మాయిలను ఈ కూపం నుండి రక్షించారు. వారి నుండి పోలీసులు ఒక రివాల్వర్, ఓకారు, కండోమ్స్, పోర్న్ ఫిలిం సిడిలను స్వాధీనం చేసుకున్నారు. ఫేస్‌బుక్, మెయిల్స్ ద్వారా అమ్మాయిల ఫోటోలను కస్టమర్స్‌కు పంపించేవారు.

Leave a Comment